ఈ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినాలంటే రూ.1.5 లక్షలు ఖర్చు చేయాల్సిందే

1 Aug, 2021 08:25 IST|Sakshi

న్యూయార్క్‌: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌.. చాలా మంది వీటిని తినే ఉంటారు.. ఈ చిత్రంలోని ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినడం సంగతి పక్కనపెడితే.. కొనడం చాలా కష్టమే.. ఎందుకంటే.. ప్లేట్‌ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ధర అచ్చంగా రూ.1.5 లక్షలు.. ఇందులో వాడిన పదార్థాలన్నీ ప్రపంచంలోనే అత్యుత్తమమైనవట. అంతేకాదు.. 23 క్యారట్ల బంగారం పొడి(తినదగినది)ని కూడా వేశారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌గా ఇది గిన్నిస్‌ రికార్డు సాధించింది.

అయితే.. ఇందుకోసం గిన్నిస్‌ వాళ్లు షరతు పెట్టారట. ఊరికే తయారుచేసేస్తే సరిపోదు.. అందరికీ అందుబాటులో ఉండాలి.. సాధారణ వినియోగదారులు ఎవరైనా కొని తినాలి అని.. ఈ మధ్యే ఆ తంతు కూడా పూర్తయిందట. మీరు కూడా రేటు ఎక్కువైనా టేస్ట్‌చేస్తాం అంటారా.. అయితే.. న్యూయార్క్‌లోని సెరెన్‌డిప్టీ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు