Guinness World Record: బతికే ఛాన్స్‌ జీరో.. బర్త్‌ డే వేడుకలు..

22 Jun, 2021 12:10 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలో అత్యంత తక్కువ రోజులకే భూమిపైకి వచ్చిన ఓ బుడతడు తన మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. అమెరికాకు చెందిన బెత్‌, రిక్‌ దంపతులకు 2020, జూన్ 5న రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్ జన్మించాడు. అయితే రిచర్డ్‌ బతికే ఛాన్స్‌ జీరో అని అప్పట్లో డాక్టర్లు తేల్చేశారు. కానీ తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణలో రిచర్డ్‌ తన ఫస్ట్‌ బర్త్‌ డే వేడుకలను జరుపుకున్నాడు. 21 వారాల 2 రోజులకు జన్నించి బతికిన శిశువుగా రిచర్డ్‌ స్కాట్‌ విలియం హచిన్సన్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించాడు.

340 గ్రాముల బరువు.. 26 సెంటీ మీటర్ల పొడవు
నిజానికి బెత్‌ హచిన్సన్‌​ డెలివరీ డేట్‌ 2020 అక్టోబర్‌ 13. అయితే కొన్ని సమస్యల కారణంగా ముందే బిడ్డను ఆపరేషన్‌ చేసి బయటకు తీయాల్సి వచ్చింది. దీనిపై వైద్యులు బెత్‌ హచిన్సన్‌ భర్త రిక్‌ హచిన్సన్‌తో తీవ్రమైన చర్చలు జరిపిన తరువాత బిడ్డను బయటకు తీశారు. రిచర్డ్‌ స్కాట్‌ జన్మించినపుడు కేవలం 340 గ్రాముల బరువు.. 26 సెంటీ మీటర్ల పొడవు.. ఓ అరచేతిలో సరిపోయే సైజు మాత్రమే ఉన్నాడు. ఇక అతడి బరువు పూర్తికాల నవజాత శిశువు సగటు బరువులో పదోవంతు అన్నమాట.

బతకడం జీరో ఛాన్స్‌ అన్న డాక్టర్‌
రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్ పుట్టినప్పుడు అతడు బతకడం జీరో ఛాన్స్‌ అని మిన్నియాపాలిస్‌లోని చిల్డ్రన్స్ మిన్నెసోటా ఆసుపత్రిలోని  డాక్టర్‌ నియోనాటాలజిస్ట్ స్టేసీ కెర్న్ అభిప్రాయపడ్డారు.  సాధారణంగా ఓ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటలకు రావడానికి 40 వారాల సమయం పడుతుందని తెలిపారు. ఇక గతంలో కెనడాలోని ఒట్టావాలో బ్రెండా, జేమ్స్ గిల్ దంపతులకు 1987, మే 20న జన్మించిన జేమ్స్ ఎల్గిన్ గిల్ పేరిట గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ఉండేది. జేమ్స్ తల్లి  గర్భంలో 21 వారాల 5 రోజులు మాత్రమే ఉన్నాడు.

చదవండి: విషాదం: ప్రపంచ రికార్డ్‌ కోసం ఫీట్‌.. ప్రాణాలు గాల్లో..


 

మరిన్ని వార్తలు