గ్రాండ్‌ ఓల్డ్‌ లేడీ ఆన్‌ ది ఎర్త్ ఇక లేరు.. జపాన్‌లోనే ఎక్కువ!

26 Apr, 2022 11:40 IST|Sakshi

Oldest Woman Kane Tanaka Dies: ప్రపంచంలో అత్యధిక వయసుతో పేరుబడ్డ వ్యక్తి ఇక లేరు. జపాన్‌కు చెందిన 119 ఏళ్ల కేన్‌ టనాకా.. సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. 

జనవరి 2, 1903లో పుట్టిన కేన్‌ టనాకా.. 2019లోనే ఈ భూమ్మీద అత్యధిక వయసున్న వ్యక్తిగా అధికారికంగా రికార్డుల్లో ఎక్కారు. పశ్చిమ జపాన్‌లోని ఫుకువా నగరంలోని ఓ ఆస్పత్రిలో వృద్ధాప్య రిత్యా సమస్యలతో ఆమె కన్నుమూసినట్లు ఒక ప్రకటన వెలువడింది. 

ఇదిలా ఉండగా.. జపాన్‌లో వందేళ్లు దాటుతున్న వృద్ధుల సంఖ్య సుమారు 85 వేలమందికి పైనే ఉంది. ప్రపంచంలోనే ఇదొక రికార్డు. ఇందులో ప్రతీ పది మందిలో తొమ్మిది మంది ఆడవాళ్లే ఉంటున్నారు. వాళ్ల ఆరోగ్య రహస్యాలపై, జీవన శైలిపై పరిశోధనలూ జరుగుతున్నాయి కూడా.

మరిన్ని వార్తలు