రూ. కోటి పెట్టి కొన్న విస్కీ.. కానీ తాగలేరు

17 Jul, 2021 17:45 IST|Sakshi
రూ. కోటి పలికిన విస్కీ బాటిల్‌

బోస్టన్‌/వాషింగ్టన్‌: వస్తువులు, దుస్తులు, ఇతరాత్ర ఏవి తీసుకున్న ఎంత పాతవైతే అంత తక్కువ ధర పలుకుతాయి. కానీ మద్యం విషయంలో మాత్రం ఇది రివర్స్‌లో జరుగుతుంది. ఏళ్ల నాటి మద్యం ఖరీదు ఎక్కువ చేస్తుంది. గతంలో ఓ వైన్‌ బాటిల్‌ ఏడు కోట్లు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ విస్కీ బాటిల్‌ కూడా ఇదే రేంజ్‌లో భారీ ధర పలికింది. ఒక్క విస్కీ బాటిల్‌ కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగా చెల్లించారు. 

అంత ఖరీదు ఎందుకు.. దాన్నేమైన స్వర్గం నుంచి తీసుకువచ్చారా ఏంటి అని భావిస్తే.. తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ విస్కీ బాటిల్‌ చాలా పురాతనమైనది. దాదాపు 250 ఏళ్ల క్రితం నాటిది కావడంతో ఈ విస్కీ బాటిల్‌ ఇంత ధర పలికింది. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత ఖరీదు పెట్టి కొన్న విస్కీని తాగలేరు. ఎందుకో తెలియాలంటే ఇది చదవండి..

వేలం పాట నిర్వహించే అమెరికా బోస్టన్‌కు చెందిన హౌస్ స్కిన్నర్ ఇంక్. అనే కంపెనీ ఈ విస్కీ బాటిల్‌ని వేలం వేసింది. ఇక దీని ధర 20-40 వేల డాలర్ల మధ్య అమ్ముడవుతుందని భావించింది. కానీ  అది అనూహ్యంగా అంతకు ఆరింతలు పలికింది. ఈ ఏడాది జూన్‌ 30న ముగిసిన వేలంలో ఈ బాటిల్‌ను మిడ్‌టౌన్ మాన్హాటన్‌లోని మ్యూజియం, పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీకి 1,37,500 డాలర్లకు (1,02,63,019 రూపాయలకు) విక్రయించారు.

విస్కీ బాటిల్‌ చరిత్ర ఏంటి..
డెయిలీ మెయిల్‌ కథనం ప్రకారం... ఇంగ్లెడ్యూ విస్కీని 1860లో బాటిల్‌లో నింపారు. ఆ తర్వాత దీన్ని మోర్గాన్‌ లైబ్రరీకి అమ్మారు. ఆ కాలపు ప్రసిద్ధ ఫైనాన్షియర్ జాన్ పియర్ పాయింట్ మోర్గాన్‌ ఈ విస్కీ బాటిల్‌ను కొనుగోలు చేశారు. సీసా వెనుక భాగంలో ఉన్న లేబుల్‌ మీద ఇలా ఉంది ‘ఈ బౌర్బన్ బహుశా 1865 కి ముందే తయారు చేసి ఉండవచ్చు. ఇది మిస్టర్ జాన్ పియర్‌పాయింట్ మోర్గాన్ గదిలో ఉంది. అతని మరణం తరువాత ఆయన ఎస్టేట్‌ నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నాం’’ అని ఉంది. 

నిపుణలు ప్రకారం జేపీ మోర్గాన్‌ ఈ బాటిల్‌ని 1900 లలో జార్జియా పర్యటనలో కొన్నారని నిపుణులు భావిస్తున్నారు. ఆయన తరువాత బాటిల్‌ మోర్గాన్‌ కొడుకుకు చేరింది. అతను దానిని 1942 -1944 మధ్య దక్షిణ కెరొలిన గవర్నర్ జేమ్స్ బైర్నెస్‌కు ఇచ్చాడు. జేమ్స్‌ బైర్నెస్‌ ఆ బాటిల్‌ని తెరకుండా అలానే ఉంచాడు. 

1955 లో పదవీవిరమణ చేసిన తరువాత బైర్నెస్ తెరవని బాటిల్‌ని స్నేహితుడు, ఆంగ్ల నావికాదళ అధికారి ఫ్రాన్సిస్ డ్రేక్‌కు పంపాడు. అతను దానిని మూడు తరాల పాటు భద్రంగా దాచాడు. ఈ విస్కీ దాదాపు రెండు శతాబ్దాల క్రితం తయారు చేసినది కావున దీన్ని తాగేందుకు కుదరదు. సాధారణంగా మూత తెరవకుండా ఉంటే విస్కీ పది సంవత్సారాల పాటు అలానే ఉంటుంది. అప్పుడు కూడా దాన్ని తాగలేం. 
 

మరిన్ని వార్తలు