World Rose Day: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి

22 Sep, 2021 09:06 IST|Sakshi

క్యాన్సర్‌తో పోరాడుతూ ఏటా వేలాదిమంది చనిపోతున్న సంగతి మనకు తెలియంది కాదు. ప్రముఖులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో!. గతంతో పోలిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీ సాయంతో క్యాన్సర్‌ని మొదటి దశలో గుర్తించి బయట పడే మార్గాలు ఉన్నాయి. రోగులు కూడా త్వరితగతిన కోలుకోగలుగుతున్నారు. కానీ ఈ వ్యాధిని జయించాలంటే కావల్సింది మెరుగైన వైద్యమే కాక మనోధైర్యం అత్యంత ముఖ్యం.

క్యాన్సర్‌ అనగానే జీవితం మీద ఆశ వదులుసుకునేంతగా అందర్నీ భయబ్రాంతులకు గురు చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ప్రపంచ దేశాలన్ని ముందుకు వచ్చి క్యాన్సర్‌ని జయించే విధంగా ప్రజలకు మనోధైర్యంతో పాటు చైత్యవంతులను చేసే విధంగా అడుగులు వేయాలని సంకల్పించాయి. దానిలో భాగంగానే ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ రోజ్‌ డే అనే ప్రతిపాదన తీసుకువచ్చింది. దీంతో ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 22న ప్రపంచ గులాబీ దినోత్సవం (వరల్డ్‌ రోజ్‌ డే)ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. 

(చదవండి: జీ7 పన్నుల ఒప్పందం అమలుతో పురోగతి సాధించగలం: బోరిస్ జాన్సన్)

దీని వెనుక ఉన్న చరిత్ర: 
కెనడియన్‌ అమ్మాయి మెలిండా రోజ్‌ గౌరవార్థం క్యాన్సర్‌ రోగుల కోసం ప్రపంచ గులాబీ దినోత్సవం జరుపుకుంటారు. ఆమె కేవలం 12 సంవత్సరాల వయసులో అరుదైన బ్లడ్‌ క్యాన్సర్‌(రక్త క్యాన్సర్‌) అయిన అస్కిన్స్‌ ట్యూమర్‌తో బాధపడింది. ఆమె కొన్ని వారాలు మాత్రమే జీవించగలదు అని వైద్యులు చెప్పారు. కానీ ఆమె తన అచంచలమైన మనోధైర్యంతో ఆరేళ్లు జీవించగలిగింది. అంతే కాదు తనలా క్యాన్సర్‌తో బాధపడుతున్నవారిని తన కవితలతో, సందేశాత్మకమైన ఉత్సాహపూరిత మాటలతో, సందేశాలతో ప్రోత్సాహించింది. వారిలో ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడగలిగే మనోశక్తిని, ధైర్యాన్ని నింపడమే కాక చనిపోయేంత వరకు సంతోషంగా ఎలా ఉండాలో చేసి చూపించింది.

తాను అంత చిన్న వయసులో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మరోవైపు  తనలా బాధపడుతున్న వారి పట్ల ఆమె కనబర్చిన గుండె నిబ్బరానికి గుర్తుగా  ప్రతి ఏటా ఆమె పేరుతో వరల్డ్‌ రోజ్‌ డే(ప్రపంచ గూలాబీ దినోత్సవం) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. క్యాన్సర్‌ రోగుల్లో ఆమె స్ఫూర్తిని నింపేలా ప్రతి ఏడాది ఒక సరికొత్త థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది థీమ్‌:  "జీవించే సమయం తగ్గిపోవచ్చు.. ప్రతి రోజు ఉదయించే సూర్యుడిని చూసినప్పుడల్లా.. మీరు ఈ రోజు గెలిచాను జీవిస్తున్నాను అనే అనుభూతిని పొందండి. అలా ఆ రోజుని ఆనందంగా గడపండి, ఆస్వాదించండి."


ఈ వ్యాధి బారినపడిని కొందరి ప్రముఖుల మనోభావాలు...

  • మీరు ఏదో కోల్పోతున్నాను అనుకునే కంటే మీరు చనిపోతున్నారు అనే విషయాన్ని గుర్తించుకోవటమే ఉత్తమమైన మార్గం. ఈ సమయం మీ మనస్సుకు దగ్గరగా ఉండి నచ్చినవి చేసి ఆనందంగా గడిపే క్షణాలుగా భావించండి.

- స్టీవ్‌ జాబ్స్‌

  • క్యాన్సర్‌ మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మీరు ద్వేషించిన వాళ్లను, ప్రేమించిన వాళ్ల పట్ల కనబర్చిన ప్రతీది మీకు గుర్తుకు రావడమే కాక ఏం చేసుంటే బాగుండేది అనేది కూడా తెలుస్తుంది. అంతేకాదు సమయాన్ని వృధా చేయరు. మీకు ఇష్టమైన వ్యక్తులతో ప్రేమిస్తున్నానే విషయాన్ని చెప్పడానికి కూడా వెనుకడుగు వేయరు.

-జోయెల్‌ సీగెల్‌

  • మీకు ఏదైనా నచ్చకపోతే దాన్ని మార్చండి. ఒకవేళ దానిని మార్చలేనిదైత మీరే మీ వైఖరిని మార్చుకోండి.

- మాయ ఏంజెలో

  • క్రికెటే నాజీవితం. క్యాన్సర్‌కు ముందు నేను సంతోషంగా ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి భారినపడ్డానో అప్పుడే నాలో ఆందోళన, భయం మొదలైయ్యాయి. నాలా బాధపడుతున్న వాళ్లని చూసినప్పుడు దీన్ని ఏ విధంగానైనా ఎదిరించి జీవిచడమే కాక తనలా బాధపడేవాళ్లకు తన వంతు సాయం చేయాలనే తపన మొదలైంది. మళ్లీ నా జీవితం నాకు తిరిగి లభించినందుకు సంతోషంగా ఉంది.

- క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌

(చదవండి: పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లో తొలి హిందూ మహిళగా సనా)

మరిన్ని వార్తలు