World Skyscraper Day 2021: మొట్టమొదటి ఆకాశ హార్మ్యం ఏది? ఎవరు కట్టారో తెలుసా?

3 Sep, 2021 10:57 IST|Sakshi

World Skyscraper Day 2021: జనారణ్యంలో ఆకాశాన్ని తాకే అద్భుతాల్ని ‘బహుళ అంతస్తుల భవనాలు’ అని పిలుచుకుంటున్నాం. నగరాలకు హారాలుగా మారుతున్న భారీ భవనాలు మన చుట్టూనే బోలెడన్ని ఉన్నాయి.  వీటికి అయ్యే ఖర్చు మాత్రమే కాదు.. కట్టడానికి సమయం, వాటి నిర్మాణం వెనుక శారీరక శ్రమ కూడా వాటిలాగే ఆకాశాన్ని అంటుతుంటాయి. అందుకే వీటికంటూ ఒక రోజు కూడా ఉంది.

   

ఇవాళ ప్రపంచ బహుళ అంతస్తుల భవన దినోత్సవం(స్కైస్క్రాపర్‌ డే). 

 స్కైస్క్రాపర్స్‌ డే ప్రధాన ఉద్దేశం.. 130 ఏళ్లుగా బహుళ అంతస్తుల నిర్మాణాల కోసం కృషి చేస్తున్న ఇంజినీరింగ్‌ నిపుణులు, ఆర్కిటెక్టర్‌లను గౌరవించుకోవడం, వాళ్ల గురించి తెలుసుకోవడం కోసం.
 

మొదటి బహుళ అంతస్తుల భవవాన్ని మొదటగా డిజైన్‌ చేసిన ఆర్కిటెక్ట్‌ విలియమ్‌ లె బారోన్‌ జెన్నెకి గుర్తింపు దక్కింది.
చికాగోలోని హోం ఇన్సురెన్స్‌ భవవాన్ని(1984).. ప్రపంచంలోని మొట్టమొదటి స్కైస్క్రాపర్‌గా గుర్తించారు.
 

సెప్టెంబర్‌ 3న ప్రముఖ ఆర్కిటెక్ట్‌ లూయిస్‌ సుల్లైవన్‌ పుట్టినరోజు. ఈయన్ని ఫాదర్‌ ఆఫ్‌ స్కైస్క్రాపర్స్‌ అంటారు.
 ఈయన మోడ్రనిజానికి కూడా ఫాదర్‌లాంటి వాడనే పేరుంది. అమెరికాలోని వెయిన్‌రైట్‌ బిల్డింగ్‌, ది క్రౌజ్‌ మ్యూజిక్‌ స్టోర్‌, యూనియన్‌ ట్రస్ట్‌ బిల్డింగ్‌, ది ప్రూడెన్షియల్‌ బిల్డింగ్‌.. ఇలా ఎన్నో బిల్డింగ్‌లను చీఫ్‌ ఆర్కిటెక్ట్‌గా పని చేశారు.

 

అందుకే ఈ రోజును(సెప్టెంబర్‌ 3ను) ‘వరల్డ్‌ స్కైస్క్రాపర్‌’డేగా నిర్వహిస్తున్నారు. 
స్కైస్క్రాపర్స్‌(బహుళ అంతస్తుల భవంతి) ఆధునిక యుగంలో భారీ భవనాలకు ముద్దుగా పెట్టుకున్న పేరు. 
కనీసం వంద మీటర్ల నుంచి 150 మీటర్లు ఉంటేనే.. అది బహుళ అంతస్తుల భవనంగా గుర్తిస్తారు.(కంపల్సరీ అనేం లేదు). కాకపోతే పది అంతస్తుల కంటే ఎక్కువ మాత్రం ఉండాలి. అన్ని వసతులూ ఉండాలి.  
ప్రపంచంలో అతిఎత్తైన బహుళ అంతస్తుల భవనం.. బుర్జ్ ఖలీఫా
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ దుబాయ్‌లో ఉన్న బుర్జ్‌ ఖలీఫా కట్టడం.. ప్రపంచ వింతల్లోనూ చోటు దక్కించుకుంది. అమెరికా ఆర్కిటెక్ట్‌ అడ్రియాన్‌ స్మిత్‌ దీనిని రూపొందించగా.. స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌, మెర్రిల్‌ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించాయి. బిల్‌ బేకర్‌ నిర్మాణ ఇంజినీర్‌గా వ్యవహరించాడు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ దీని ఓనర్‌.
  

  • బుర్జ్‌ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు(2, 722 అడుగులు), 168 అంతస్తులు
  • 12 వేల మంది ఈ బిల్డింగ్‌ కోసం పని చేశారు
  • ఒకటిన్నర బిలియన్‌ డాలర్ల ఖర్చుతో ఈ భవనాన్ని కట్టించారు
  •  జనవరి 4, 2010 నుంచి ఇది ఓపెన్‌ అయ్యింది
  •  లిఫ్ట్‌ స్పీడ్‌  గంటకు 65 కిలోమీటర్లు. అంటే రెండు నిమిషాల్లో 124వ అంతస్తుకు చేరుకోవచ్చు.
     

 ప్రపంచంలో రెండో పెద్ద బహుళ అంతస్తుల భవనం.. షాంగై టవర్‌(చైనా). ఎత్తు 632 మీటర్లు(2,073 అడుగులు)-163 అడుగులు. ఇది మెలికలు తిరిగి ఉండడం విశేషం. అమెరికన్‌ ఆర్చిటెక్ట్‌ మార్షల్‌ సస్రా‍్టబలా, చైనా ఆర్కిటెక్ట్‌ జన్‌ గ్సియాలు దీనిని డిజైన్‌ చేశారు.
 
 
► భారత్‌లో అతిపెద్ద భవనంగా ముంబై ‘పోలయిస్‌ రాయల్‌’కు పేరుంది. దీని ఎత్తు 320 మీటర్లు(1,050 అడుగులు)-88 అంతస్తులు. నోజర్‌ పంథాకీ నేతృత్వంలోని తలాటి పంథాకీ అసోషియేట్స్‌ ఈ భవనాన్ని రూపకల్పన చేసింది.

- సాక్షి, వెబ్ స్పెషల్

చదవండి: పేన్లను పచ్చడి చేసి వ్యాక్సిన్‌ తయారు చేశాడు

మరిన్ని వార్తలు