-

పక్షవాతంతో కుర్చీలో.. అయినా ట్విటర్‌లో ‘హలో వరల్డ్‌’ ట్వీట్‌! ఎలాగంటే..

28 Dec, 2021 17:02 IST|Sakshi

Paralysed man becomes worlds first person: పక్షవాతం గురించి మనందరికి తెలిసిందే. శరీరంలో ఏ భాగానికి పక్షవాతం వస్తుందో ఆయా భాగాలు చచ్చుబడిపోవడమే కాకుండా కదిలించలేరు. ఒక్కొసారి ఆ పరిస్థితి చాలా దయనీయంగా కూడా ఉంటుంది. అయితే పక్షవాతంతో శరీరం అంతా చ్చుబడిపోయి కదలకుండా ఉన్నవ్యక్తి తన మనసుతో ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఎలా ట్విట్‌ చేశాడని ఆలోచించేయకండి.!


(చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!)

అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియాకు చెందిన  ఫిలిప్ ఓకీఫ్ వేళ్లతో కాకుండా మొదడును మాత్రమే ఉపయోగించి ట్వీట్‌ చేశాడు. అంటే అతను మెదడు కంప్యూటర్‌కి కనక్ట్‌ అవ్వడంతో తన ఆలోచనలకు అనుగుణంగా సందేశం కంప్యూటర్‌లో టైప్‌ అవుతుంది. నిజానికి ఫిలిప్‌ 2015 నుండి అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ఏఎల్‌ఎస్‌)తో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితి కారణంగా అతను శరీరం అంతా పక్షవాతానికి గురై కదలకుండ చచ్చుబడిపోయింది. అయితే కాలిఫోర్నియాకు చెందిన బ్రెయిన్‌-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ కంపెనీ ఇలాంటి వ్యక్తులు తమ మనసుతో కంప్యూటర్‌ని ఆపరేట్‌ చేయగలిగేలా ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని  తీసుకువచ్చింది.

ఈ మేరకు ఆ కంపెనీ 62 ఏళ్ల ఫిలిప్‌ మొదడుని కంప్యూటర్‌కి అనుసంధినిస్తూ  పేపర్‌క్లిప్ పరిమాణంలో ఉండే సింక్రోన్ స్టెంట్రోడ్ అనే మైక్రోచిప్‌ని అమర్చింది. దీంతో అతని మెదడుకు సంకేతాలను అందజేసే చిన్నమొదడు ఆలోచనలను ఈ ఇంప్లాంట్‌ మైక్రోచిప్‌ చదివి టెక్స్ట్‌(సందేశంగా) రూపొందిస్తుంది లేదా అనువదిస్తుంది. అయితే ఫిలిప్‌కి ఈ బ్రెయిన్ ఇంప్లాంట్‌ సాంకేతికతో ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ పెట్టాలనే ఆలోచన వచ్చింది.

అనుకున్నదే తడువుగా ఫిలిప్ 'హలో వరల్డ్' అనే సందేశాన్ని ట్విట్‌ చేశాడు. ఈ ట్విట్‌ కారణంగా ఫిలిప్‌ ప్రపంచంలోనే ఆలోచన ద్వారా నేరుగా సోషల్ మీడియా సందేశాన్ని విజయవంతంగా పోస్ట్ చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అంతేకాదు ఇది మొదటి ప్రత్యక్ష-ఆలోచన ట్వీట్‌గా కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో ఫిలిప్‌ మాట్లాడుతూ..." ఈ సాంకేతికత గురించి మొదటిసారిగా  విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అంతేకాదు ఈ సాంకేతికతను వినియోగించాలంటే కొంత సాధన కూడా అవసరం. ఇక ఇప్పుడు నేను కంప్యూటర్‌లో ఎక్కడ క్లిక్ చేయాలనుకుంటున్నాను అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అంతేకాదు ఈమెయిల్‌, షాపింగ్‌, బ్యాంకింగ్‌ వంటి పనుల్ని కంప్యూటర్‌లో చేయగలను " అని అన్నారు.

(చదవండి: ప్రేమానుబంధాలు మీకేనా? మాకూ ఉంటాయి)

మరిన్ని వార్తలు