బ్రిటన్‌ రాణికి గొప్ప నివాళి... ఆకాశమే హద్దుగా పోర్ట్రెయిట్‌ని రూపొందించిన పైలెట్‌

8 Oct, 2022 18:42 IST|Sakshi

బ్రిటన్‌రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ 2న సెప్టెంబర్‌ 8న స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దివగంత బ్రిటన్‌ రాణికి  సరిగ్గా ఒక నెల తర్వాత ఆమెకు ఒక పైలెట్‌ అత్యంత ఘనమైన నివాళి అందించింది. అదీ కూడా విమానంతో ఆకాశంలో అతిపెద్ద క్విన్‌ ఎలిజబెత్‌ పోర్ట్రెయిట్‌ని రూపొందించింది. ఈ మేరకు పైలెట్‌ అమల్‌ లార్‌లిడ్‌ అక్టోబర్‌ 6న క్వీన్‌ ఎలిజబెత్‌  పోర్ట్రెయిట్‌ని రూపొందిచిందని గ్లోబల్‌ ఫ్టైట్‌ ట్రాకింగ్‌ సర్వీస్‌ రాడార్‌ 24 తన ట్విట్టర్‌లో పేర్కొంది.

ఆమె సుమారు రెంగు గంటలు దాదాపు 413 కిలోమీటర్లు ప్రయాణించి లండన్‌కి వాయువ్యంగా 105 కి.మీ పొడవు, 63 కి.మీ వెడల్పుతో బ్రిటన్‌ రాణి పోర్ట్రెయిట్‌ని రూపొందించింది. ఆమె ఫ్టైట్‌ జర్నీకి వెళ్లే ముందే రాడార్‌తో మాట్లాడు తాను సిద్ధం చేసుకున్న ప్లైట్‌ ప్లానింగ్‌ ప్రోగ్రామ్‌ ఫోర్‌ఫ్లైట్‌ ద్వారా గుర్తించబడిన ఫార్మాట్‌లో విమానాన్ని పోనిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపింది. అంతేకాదు తాను అవసానదశలో ఉ​న్న రోగుల సంరక్షణ కోసం పనిచేసే యూకే స్చచ్ఛంద సంస్థ కోసం డబ్బులను సేకరిస్తున్నట్లు అమల్‌ పేర్కొంది. ఈ బ్రిటన్‌ రాణి పోర్ట్రెయిట్‌ ప్రపంచంలోనే అతిపెద్దదిగా యూకే పేర్కొంది. 

(చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు)

మరిన్ని వార్తలు