World Longest Snake: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..!

28 Mar, 2023 19:47 IST|Sakshi

ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అ‍య్యే ఫొటోలు, వీడియోలు చూస్తే ఒక్కోసారి గుండె ఆగినంత పని అవుతుంది. ముఖ్యంగా పాములు, అనకొండలకు సంబంధించిన దృశ్యాలు భయంకరంగా ఉంటాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ పైథాన్ వీడియోను చూస్తే మీరు హడలెత్తిపోవడం ఖాయం.

సాధారణంగా అందరు పాము జాతుల్లో అనకొండ అతిపెద్దది అయి ఉంటుందని అనుకుంటారు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద పాము రెటిక్యులేటెడ్‌ పైథాన్. దక్షిణ, ఆగ్నేయ ఆసియా వీటికి నిలయం.  తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఈ పాముదే.

అత్యంత భారీ సైజులో, నమ్మశక్యంగానీ రీతిలో ఉన్న రెటిక్యులేటెడ్ పైథాన్‌.. ఓ ఇంట్లో తిరుగుతూ కన్పించడం నెటిజన్లను విస్మయానికి గురి చేసింది. దీన్ని చూసిన కొందరికి దిమ్మతిరిగిపోయింది. ఇది నిజంగా పామేనా లేక గ్రాఫిక్సా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ ఆయిన ఈ పాము వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో నిడివి 17 సెకన్లు మాత్రమే ఉంది. పాము మెల్లగా ఓ ఇంటి గోడపై నుంచి లోనికి వెళ్లింది. ఎంత పెద్ద ధైర్యవంతుడైనా సరే.. ఈ పాము పరిమాణాన్ని చూస్తే హడలిపోయేలా ఉంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలను పోస్టు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరికొందరు హమ్మయ్య.. లక్కీగా ఈ పాము మా ఇంట్లో లేదు అని నవ్వులు పూయించారు.
చదవండి: ఓ రేంజ్‌లో రివేంజ్‌ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు