Kane Tanaka: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే పుట్టిన బామ్మ బర్త్‌డే!

3 Jan, 2022 13:04 IST|Sakshi

ప్రస్తుతం మనుషులు సరైన జీవన సరళిన పాటించకపోవడం దీనికితోడు వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులతో మానవుల ఆయుః ప్రమాణం రోజురోజుకి తగ్గిపోతుంది . పైగా ఒత్తిడి, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడంతో రకరకాల వ్యాధుల భారినపడి అతి తక్కువ వయస్సులోనే మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. అలాంటి పరిస్థితిని సైతం తట్టుకుని సెంచరీ వయసుదాటిన ఇప్పటికి  ఆరోగ్యంగానే ఉండటమే కాక 119వ పుట్టినరోజు జరుపుకుంది జపాన్‌కి చెందిన శతాధిక వృద్ధురాలు.

(చదవండి: ఇప్పుడు పశ్చాత్తాపం పడిన ప్రయోజనం లేదు!... శిక్షలు అనుభవించాల్సిందే!!)

అసలు విషయంలోకెళ్లితే...జపాన్‌కు చెందిన తనకా 1903లో జన్మించింది. అదే ఏడాది రైట్ బ్రదర్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి విమానాన్ని కనుగొన్నారు. అంటే ఆమె మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి 11 సంవత్సారాల ముందు జన్మించింది. అంతేకాదు ప్రపంచంలేనే అత్యంత వృద్ధ మహిళ అయిన కేన తనకా తన 119వ పుట్టినరోజును జనవరి2, 2022న జరుపుకున్నారు. ఆమె ప్రస్తుతం ఫుకుయోకాలోని ఒక నర్సింగ్ హోమ్‌లో నివసిస్తోంది.

అయితే ఆమె మాట్లాడలేదు కానీ తన  హావభావాలను ఉపయోగించి సిబ్బందితో కమ్యూనికేట్ చేస్తుంది. అంతేకాదు ఆమె ఎక్కువగా పజిల్స్ పరిష్కరించడంలో గడపడానికి ఇష్టపడుతుంది. పైగా ఆమె 1922లో హిడియో తనకాను వివాహం చేసుకుంది. అయితే ఆమెకు ఐదుగురు పిల్లలు. ఆమె భర్త, పెద్ద కుమారుడు రెండవ చైనా-జపనీస్ యుద్ధంలో పాల్గోన్నారు.

అంతేకాదు 2020 నాటికి ఆమెకు ఐదుగురు మనవళ్లు ఎనిమిది మంది మనవరాళ్లు ఉన్నారు. పైగా తనకా ఇప్పటికీ గణితం, నగీషీ వ్రాతలను అధ్యయనం చేయడంలో ఉత్సాహంగా ఉంది. ఆమె తన కుటుంబ సభ్యులు, నర్సింగ్ హోమ్ అటెండెంట్‌లతో బోర్డ్ గేమ్‌లు ఆడుతుండటం మరొక విశేషం. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2019లో తనకాని ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా జీవించి ఉన్న వ్యక్తిగా గుర్తించింది. అయితే ఆ సమయానికి ఆమె వయసు 116.

(చదవండి: భారత సంతతి అమృతపాల్‌ సింగ్‌ మాన్‌కు యూకే గౌరవ జాబితాలో చోటు !)

మరిన్ని వార్తలు