గిన్నిస్‌ రికార్డుల్లోకి బుజ్జి ఆవు?

17 Jul, 2021 04:37 IST|Sakshi
భూటాన్‌ జాతికి చెందిన ఆవు రాణి (తెల్లటి రంగు)

లేగ దూడ ఎంత ముద్దుగా ఉందో కదూ..! ఈ దూడ చూడటానికి చుట్టుపక్కల ఊర్లకు చెందిన వందల మంది వస్తున్నారట. ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంతమంది ఎందుకు వస్తారనే కదా మీ అనుమానం. ఈ లేగ దూడ చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు ఉన్న ఆవుగా రికార్డుల్లోకి ఎక్కనుంది. ఇది ఎంత ఎత్తు ఉందో తెలుసా 21 అంగుళాలు (51 సెంటీమీటర్లు) మాత్రమే. పైగా 26 కిలోలు మాత్రమే ఉన్నట్లు దీని యజమానులు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌ చారిగ్రామ్‌లోని ఓ గో సంరక్షణ కేంద్రంలో ఈ ఆవు దూడ వయసు 23 వారాలు. భూటాన్‌ జాతికి చెందిన ఈ ఆవును రాణి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.అయితే ఇప్పటివరకు అతి చిన్న ఆవుగా భారత్‌కు చెందిన మాణిక్యం (వేచూర్‌ జాతి) గిన్నిస్‌ రికార్డుల్లో ఉంది. మాణిక్యం 24 అంగుళాలు (31 సెంటీమీటర్లు) ఎత్తు ఉంటుంది. దీన్ని బట్టి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధులు కనుక పరిశీలిస్తే కచ్చితంగా మాణిక్యం రికార్డును రాణి ఎత్తుకుపోతుందని దాని యజమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు