ఆరు రెట్లు అధికంగా కరోనా వైరస్‌ వ్యాప్తి

20 Nov, 2020 11:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనావైరస్ ప్రపంచాన్ని ఇంకా అతలకుతలం చేస్తూనే ఉంది. ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నివేదించిన వాస్తవ సంఖ్య కంటే ఆరు రెట్లు అధికంగా సంక్రమిస్తుందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ఏఎన్‌యూ), మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకుల అధ్యయనం ప్రకారం, 15 దేశాలలో మార్చి 2020 నుంచి ఆగస్టు 2020 మధ్య కరోనా వైరస్ వ్యాప్తి నివేదించిన కేసుల కంటే సగటున 6.2 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనాన్ని ‘రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్’లో ప్రచురించారు. ఇది యూకే, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి రేటు నివేదించిన దానికంటే చాలా ఎక్కువ. ఇటలీ విషయంలో 17 రెట్లు ఎక్కువని తెలిసింది.

డేటా ప్రకారం, 15 దేశాలలో ఏప్రిల్ చివరి నాటికి చూస్తే ఆస్ట్రేలియాల్లో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంది. అయితే వ్యాధి వ్యాప్తి రేటు ఆగస్టు చివరిలో అధికారికంగా నివేదించిన దానికంటే ఐదు రెట్లు అధికంగా ఉండొచ్చని పీటీఐ తెలిపింది. 800 మిలియన్లకు పైగా జనాభా ఉన్న 11 యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా, అమెరికాలో వాస్తవ సంఖ్య కంటే వ్యాప్తి అధికంగా ఉందని అధ్యయనంలో పరిశోధకులు అంచనా వేశారు. (చదవండి: కోవిషీల్డ్‌తో‌ మెరుగైన ఫలితాలు)

ధ్రువీకరించబడిన కేసుల కంటే అధికం...
‘అనేక దేశాలలో ధ్రువీకరించబడిన కేసుల కంటే కోవిడ్-19 వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఇది వ్యాధిని నియంత్రించడంలో, వ్యాప్తి సంభావ్యత రెండింటికీ అడ్డుగా మారింది. ఉదాహరణకు, ఒక విశ్లేషణలో 5.4 మిలియన్లకు పైగా జనాభా ఉన్నా యూకేలో సుమారు 8 శాతం జనాభాకు కరోనావైరస్ సంక్రమించింద’ని అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ క్వెంటిన్ గ్రాఫ్టన్ తెలిపిన విషయాన్ని పిటిఐ వెల్లడించింది. ‘ఈ పరిశోధనలు కరోనావైరస్ మహమ్మారిపై మనం ఎలా వ్యవహరించాం, ప్రస్తుతం కరోనా బారినపడే వ్యక్తుల అనారోగ్యం, జీవితకాలంలో వారి ఆరోగ్యంపై ఏర్పడే ప్రభావాలతో పాటు, లా​క్‌డౌన్లను ఎలా అమలు చేశాం, ఉపయోగించుకున్నాం. ఈ మహమ్మారిని  నియంత్రించడంలో ఎంతవరకు ముందున్నామ’నే విషయాలను తెలుపుతుందని గ్రాఫ్టన్ చెప్పారు.

కరోనావైరస్ మరణాలను పరిశీలించేందుకు "బ్యాక్‌కాస్టింగ్" అనే ప్రక్రియను పరిశోధకులు ఉపయోగించారు. దీనిని వ్యాధి వ్యాప్తి నుంచి లక్షణాల వరకు, వ్యాధి లక్షణాల నుంచి మరణం వరకు ఉన్న సమయంతో పోల్చారు. ఈ ప్రక్రియతో వ్యాధి వ్యాప్తి రేటును సుమారు 95 శాతం వరకు కచ్చితంగా నిర్థారించినట్టు గ్రాఫ్టన్ తెలిపారు. "సరళంగా చెప్పాలంటే, ఒక దేశంలో కోవిడ్-19తో ఎంత మంది మరణించారనే దానిపై మేము గణాంకాలను విశ్లేషించాం. ఎంత మందికి వ్యాధి సోకి చనిపోయారో అనే విషయాన్ని గత వివరాలు ఆధారంగా కనుగొన్నాం. కరోనా మరణాల సంఖ్యపై, వాస్తవ వ్యాప్తి రేటును అంచనా వేయడానికి సులభమైన పద్ధతి ఇద"ని ఇకిగై రీసెర్చ్ స్టీవెన్ ఫిప్స్ ను పీటీఐ ఉటంకించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు