సోమవారం వచ్చిందంటే బద్దకం.. మరి ‘వరస్ట్‌ డే ఆఫ్‌ ది వీక్‌’ అంటే హుషారే!

19 Oct, 2022 20:14 IST|Sakshi

వీకెండ్‌ ముగిసి... మండే వస్తుందంటే చాలు ఎక్కడ లేని నీరసం ముంచుకొస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలామంది సోమవారంనాడు ఆఫీసులకు బద్ధకంగా బాడీని ఈడ్చుకెళ్తారనొచ్చు. ఎవరో కొద్దిమంది తప్ప... స్కూల్, కాలేజ్‌ స్టూడెంట్స్, ఉద్యోగులు.. అందరిదీ దాదాపు ఇదే ఫీలింగ్‌. అందుకే ప్రతి సోమవారం.. #మండేబ్లూస్‌ లేదా #మండేమార్నింగ్‌బ్లూస్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. ఈ మండేబ్లూస్‌ సిండ్రోమ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉంది.

దీన్ని గిన్నిస్‌ సైతం గుర్తించింది. సోమవారాన్ని ‘వరస్ట్‌ డే ఆఫ్‌ ది వీక్‌’గా అధికారికంగా ప్రకటిస్తూ సోమవారం మధ్యాహ్నం తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. అట్లా పోస్ట్‌ చేసిందో లేదో... ట్విట్టర్‌ యూజర్స్‌ యమ స్పీడ్‌గా స్పందించేశారు. సోమవారానికి చెత్తవారంగా గిన్నిస్‌ రికార్డు ఇవ్వడం సూపర్‌ అంటున్నారు. ‘ఆ ఒక్కరోజే కాదు.. సుదీర్ఘ సెలవుల తరువాత వచ్చే ఏ వర్కింగ్‌ డే అయినా వరస్ట్‌ డేనే’అని మరికొందరు రీట్వీట్‌ చేశారు.
(చదవండి: ఒక్క గంటలో ‍అత్యధిక కప్పుల ‘టీ’ తయారు.. మహిళకు గిన్నిస్‌ రికార్డ్‌)

మరిన్ని వార్తలు