వైరల్: ట్రంప్ అత్యంత చెత్త అధ్యక్షుడు!

25 Jan, 2021 18:31 IST|Sakshi

వాషింగ్టన్‌ : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటికి కూడా అతని మీద ఇంకా విపరీతమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో గెలిచినాడెమోక్రాట్లతో పాటు తన పార్టీకి చెందిన రిపబ్లికన్లు సైతం ఆయన వైఖరిని తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ట్రంప్​పై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ విమర్శలు ఆకాశానికి చేరుకున్నాయి. ఫ్లోరిడాలోని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఇంటిపైనే కొందరు ఆకాశంలో బ్యానర్లను ఎగరేశారు. కేవలం ట్రంప్ ను విమర్శించేందుకే ఏకంగా విమర్శకులు విమానాలను వినియోగించారు.(చదవండి: బంధం మరింత బలోపేతం కావాలి)

ఒక ట్విట్టర్ యూజర్ డేనియల్ ఉహ్ల్‌ఫెల్డర్ పంచుకున్న వీడియోలో విమానం వెనుక భాగంలో ఉన్న ఒక బ్యానర్‌పై “ట్రంప్ వరస్ట్ ప్రెసిడెంట్ ఎవర్​(ట్రంప్ అత్యంత చెత్త ప్రెసిడెంట్​)" అని రాశారు. "ఈ రోజు మార్-ఎ-లాగో సమీపంలో ఉన్న ట్రంప్ కు ఆకాశం నుంచి ఆత్మీయ స్వాగతం లభిస్తోంది"అని వాక్యంతో ఉహ్ల్ఫెల్డర్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఈ చర్యను ప్రశంసించారు. "ఇలా పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు, ఈ పైలట్‌కు పెద్ద ధన్యవాదాలు" అని మరొకరు రాశారు.

మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో తమకు ఎలాంటి సంబంధం ఉండకూడదని మార్-ఎ-లాగోలో చాలా మంది ప్రజలు వెళ్లిపోతున్నారని సీఎన్‌ఎన్ నివేదించింది. అయితే ఇలా విమానాలతో బ్యానర్లు ఎవరు ప్రదర్శించారనే విషయం ఇంకా కనుగొనలేదు. తన హయాంలో ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని ట్రంప్ విమర్శల పాలయ్యారు. విదేశాంగ విధానం, వీసాల జారీలో నిబంధన మార్పు నుంచి కరోనా నియంత్రణలో విఫలం వరకు ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఓటమి చెందాక ట్రంప్​ ప్రోద్బలంతోనే క్యాపిటల్​ హిల్స్​పై నిరసనకారులు దాడి చేశారని విమర్శలు ఉన్నాయి. విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారని ట్విట్టర్​ ఆయనను నిషేధించింది.

మరిన్ని వార్తలు