జపాన్‌ నూతన ప్రధానిగా యోషిహిడే సుగా

15 Sep, 2020 04:12 IST|Sakshi

అధికార పార్టీ నూతన సారథిగా ఎన్నిక

టోక్యో: జపాన్‌ అధికార పార్టీకి నూతన సారథిగా యోషిహిడే సుగా ఎంపికయ్యారు. అధికార లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అంతర్గత ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను కాబోయే జపాన్‌ ప్రధానమంత్రిగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో ఈయన ఎంపికయ్యారు. సుగా ప్రస్తుతం చీఫ్‌ కేబినెట్‌ సెక్రటరీగా అబేకి కుడిభుజంగా ఉన్నారు. ఈయన పార్లమెంటుకి ఎంపిక కావడం లాంఛనమే. కరోనా కట్టడి, పతనమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం తన తక్షణ ప్రాధమ్యాలని సుగా పేర్కొన్నారు. తాను సంస్కరణ వాదినన్నారు. మాజీ ప్రధాని అబే ప్రాధమ్యాలను ఈయనా కొనసాగిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా