వైరల్‌ వీడియో: ఈ సూపర్‌ హీరోకి నెటిజన్ల ఫిదా

6 Jun, 2021 16:14 IST|Sakshi

సాధారణంగా చిన్న పిల్లలతో బయటకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఏది ప్రమాదం అనే విషయం బొత్తిగా తెలియదు. ఇక రోడ్డు ప్రమాదాల్లో రెప్పపాటుకాలంలోనే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. అయితే అలాంటి ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడితే..వారిని సూపర్‌ హీరోగా కీర్తిస్తాం. ప్రస్తుతం అటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి, ఓ కుర్రాడు రోడ్డు దాటేందుకు ఎదురుచూస్తున్నారు.

అయితే వాహనాలు విరామం లేకుండా వస్తూనే ఉన్నాయి. దాంతో వారు రోడ్డు దాటేందుకు వీలు లేకుండా పోయింది. అదే సమయంలో ఓ చిన్నారి చూసుకోకుండా అటువైపు నుంచి రోడ్డుపైకి వచ్చేస్తుంది. అది గమనించిన కుర్రాడు... రెప్పపాటులో... రోడ్డు దాటేసి... చిన్నారిని పట్టుకొని... క్షణాల్లో రోడ్డుకు అటువైపు వెళ్లిపోయాడు. ఆ యువకుడు ఒక్క క్షణం ఆలస్యం చేసినా.. ఇద్దరు ప్రమాదం బారిన పడేవారు.  కానీ ఆ కుర్రాడు వేగంగా స్పందించడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇలా అతను తన ప్రాణాలను అడ్డుగా పెట్టి.. ఓ ప్రాణాన్ని కాపాడాడు. అందుకే అంతా అతన్ని మెచ్చుకుంటున్నారు. సూపర్ హీరో అంటున్నారు. కాగా ఈ వీడియోను ఇప్పటివరకు 14 లక్షల మంది నెటిజన్లు వీక్షించగా.. వేల మంది లైక్‌ కొట్టారు.

(చదవండి: వైరల్‌: అలకబూనిన శునకం.. కారణం ఏంటి!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు