క‌రోనా వ్యాప్తికి యువ‌తే కార‌ణం: డ‌బ్ల్యూహెచ్‌వో

31 Jul, 2020 17:17 IST|Sakshi

జెనీవా: ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌కు యువ‌త అతీతం కాద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్‌వో) మ‌రోసారి హెచ్చ‌రిచింది. ఈ వైర‌స్‌తో యువ‌త‌కు కూడా ప్ర‌మాదం పొంచి ఉంద‌ని పేర్కొంది. ఈ విష‌యాన్ని ఇదివ‌ర‌కే చెప్పిన‌ప్ప‌టికీ మ‌రోసారి చెప్పాల్సి వ‌స్తోంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ టెడ్రోస్ అధ‌నామ్‌‌ పేర్కొన్నారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ యువ‌తకు కూడా క‌రోనా సోకుతుంద‌ని, వారు కూడా చ‌నిపోయే అవ‌కాశాలు ఉంటాయ‌న్నారు. కాబ‌ట్టి ఏమాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా త‌ప్ప‌నిస‌రిగా అంద‌రూ ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు. (దోమలతో కరోనా రాదు)

మ‌రోవైపు కొన్ని దేశాల్లో ప్ర‌జ‌లు విహార యాత్ర‌ల‌కు వెళుతుండ‌టంతో అక్క‌డ‌ క‌రోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. దీనిపై డ‌బ్ల్యూహెచ్‌వో సాంకేతిక బృందం నాయకురాలు మ‌రియా వాన్ కెర్కోవె మాట్లాడుతూ వైర‌స్ వ్యాప్తికి యువ‌త కార‌ణ‌మ‌వుతున్నార‌ని ఆగ్ర‌హించారు. కాగా జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ వివ‌రాల ప్ర‌కారం ఇప్ప‌టివ‌ర‌కు‌ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 1.72 కోట్లుగా న‌మోద‌వ‌గా 6.7 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. (తెలిసింది కొంతే.. తెలియనిది ఇంకెంతో!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు