మయన్మార్‌ ఆర్మీ ఛానెల్స్‌పై యూట్యూబ్‌ వేటు

6 Mar, 2021 17:09 IST|Sakshi

యాంగాన్‌: మయన్మార్‌లో మిలటరీ నడుపుతున్న అయిదు ఛానెల్స్‌ని యూట్యూబ్‌ తొలగించింది. తమ నిబంధనలకి విరుద్ధంగా ఉన్నందున ఆ ఛానెల్స్‌ని తొలగిస్తున్నట్టుగా యూట్యూబ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లు మయన్మార్‌ మిలటరీతో సంబంధం ఉన్న అన్ని పేజీలను తొలగించాయి. యూట్యూబ్‌ నిబంధనలకి విరుద్ధంగా ఎవరు ఎలాంటి వీడియోలు ఉంచినా వారి ఛానెల్స్‌ను తొలగిస్తామని ఆ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది.

మరోవైపు ఫిబ్రవరి1న ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని దింపేసి బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్న మిలటరీకి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. దేశంలో రాజకీయ సంక్షోభంపై  ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రత్యేక సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనల్ని మరింత ఉధృతం చేశారు. ప్రధాన నగరాల్లో భారీ ప్రదర్శనలు జరుగుతున్నా యి. ప్రజల నిరసనని అణచివేయడానికి భద్రతా దళాలు ప్రయత్నిస్తూ ఉండడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

చదవండి: ఖాళీగా ఇంట్లో కూర్చోలేను బిడ్డా!

స్మృతి ఇరానీ పోస్ట్‌పై సోనూసూద్‌ కామెంట్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు