వైరల్‌ వీడియో: ఏంటీ ‘పులి’తోనే ఆటలా?!

11 Nov, 2020 19:47 IST|Sakshi
యూట్యూబ్‌ వీడియోలోని దృశ్యాలు

చివర్లో జంతువులకు భోజనం పెట్టి నెటిజన్ల మనసు గెలుచుకున్న యువకుడు

బ్యాంకాక్‌: యూట్యూబ్‌లో ఫ్రాంక్‌ వీడియోలు చాలా కామన్‌. అబద్ధాన్ని నిజమని నమ్మించి, చివర్లో అసలు విషయం చెప్పగానే ప్రతి ఒక్కరూ ఫూల్‌ అవ్వాల్సిందే. ట్రెండింగ్‌లో నిలవాలంటే చాలా మంది వీటినే మార్గంగా ఎంచుకుంటారు. అయితే, థాయ్‌లాండ్‌కి చెందిన ఓ యువకుడు మాత్రం ఈ ఫ్రాంక్‌ వీడియోలను కాస్త విభిన్నంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మనుషుల మీద ఫ్రాంక్‌ చేయడంలో పెద్దగా ఆసక్తేం లేదనుకున్నాడో ఏమో గానీ, జంతువుల మీద ఫోకస్‌ చేశాడు. నిజానికి, పెద్దపులి బొమ్మ అయినా సరే, సడన్‌గా దాన్ని చూసినప్పుడు మనలో చాలా మందికి భయం వేస్తుంది కదా..! మరి చిన్న చిన్న జంతువులు ఎలా స్పందిస్తున్నాయనేది తెలుసుకోవాలని అతడికి ఆసక్తి కలిగింది. 

దీంతో ఓ పులి బొమ్మను తీసుకువెళ్లి కోతులు, కుక్కలు, పిల్లుల ముందు ప్రదర్శించాడు. ఒక్కోసారి తానే పులి ముఖాన్ని పోలిన మాస్కు ధరించి వాటి దగ్గరికి వెళ్లాడు. వీటిలో చాలా వరకు జంతువులు ‘పులి’ని చూసి భయపడగా, మరికొన్ని మాత్రం దానిని ఎదిరించేందుకు సిద్ధమయ్యాయి. మీదికి ఎగబడి రక్కడానికి ప్రయత్నం చేశాయి. ఫన్నీగా ఉన్న ఈ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫేక్‌ టైగర్‌ ఫ్రాంక్‌ వీడియోలను ‘‘ ఏంజెల్‌ నాగ’’  అనే యూట్యూబ్‌ ఛానల్‌లో మనం చూడవచ్చు. ఫన్నీగా ఉన్న ఈ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు నాలుగు మిలియన్ల వ్యూస్‌ దక్కించుకున్న ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: బేబీకి పాకడం నేర్పిస్తున్న పెంపుడు కుక్క)

అంతేగాకుండా ఈ యూజర్‌ షేర్‌ చేసిన మరో  వీడియోకి  కేవలం ఒక్క రోజులోనే రెండు మిలియన్ల వ్యూస్‌ రావడం విశేషం. ఇక వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘పట్టణంలో ఉండే జంతువులకు పులులు ఎలా ఉంటాయో కూడా తెలుసా’’ అని కొందరు ఆశ్చర్యపోతే, ఇంకొంత మంది ట్రైనింగ్‌ చేసిన జంతువులను ఈ వీడియోల కోసం వాడుకున్నారని కామెంట్‌ చేశారు. ఏదేమైనా వీడియోలు మాత్రం అద్భుతంగా ఉన్నాయని, చివర్లో సదరు యువకుడు, జంతువులకు తిండి పెట్టడం మాత్రం అభినందనీయమంటూ ప్రశంసలు కురిపించారు. (చదవండివీల్ ఛైర్‌లో ఉన్నా డ్యాన్స్‌ అదరగొట్టింది!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు