ఫిజిక్స్‌లోని ఒక ప్రశ్నకోసం .... హెలికాఫ్టర్‌నే అద్దెకు తీసుకున్నాడు

31 Oct, 2021 21:23 IST|Sakshi

న్యూయార్క్‌: ఏదైనా పరీక్షలో ప్రశ్నకు సమాధానం తెలియక వదిలేస్తే మనం టీచర్‌నో లేక మన సీనియర్స్‌నో అడుగుతాం. కానీ ఈ యూట్యూబర్‌ ఫిజిక్స్‌ పరీక్షలోని ఒక ప్రశ్నకు సమాధానం కోసం హెలికాఫ్టర్‌నే అద్దెకు తీసుకుని కనుకున్నాడు. అసలు ఏంటిది అని ఆశ్చర్యంగా ఉందా.

(చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్‌ హీరో)

వివరాల్లోకెళ్లితే.....వెరిటాసియం అనే యూట్యూబ్ చానెల్‌ని నడుపుతున్న డెరెక్ ముల్లర్ తనను కలవరపెడుతున్న ఫిజిక్స్ ప్రశ్నను పరిష్కరించడానికి హెలికాప్టర్‌నే అద్దెకు తీసుకుని ప్రయాణించాడు. 2014 యూఎస్‌ ఫిజిక్స్ ఒలింపియాడ్ అర్హత పరీక్షలో 19వ ప్రశ్నకి సమాధానం కోసం నిజంగానే ఆచరణాత్మక ప్రయోగం చేశాడు.

ఆ ప్రశ్న ఏంటంటే " ఒక హెలికాప్టర్ స్థిరమైన వేగంతో అడ్డంగా ఎగురుతోంది. హెలికాప్టర్ కింద ఒక సంపూర్ణ అనువైన యూనిఫాం కేబుల్ సస్పెండ్ చేయబడింది. కేబుల్‌పై గాలి రాపిడి చాలా తక్కువ కాదు. హెలికాప్టర్ గాలిలో కుడివైపుకి ఎగురుతున్నప్పుడు ఈ క్రింది రేఖాచిత్రాలలో ఏది కేబుల్ ఆకారాన్ని బాగా చూపుతుంది?". అయితే ఈ ప్రశ్న కోసం కాగితం లేదా కంప్యూటర్‌లో లెక్కించడానికి బదులుగా, ముల్లర్ దానిని ఆచరణాత్మకంగా పరిష్కరించాలని నిర్ణయించుకోవడం విశేషం.

ఈ మేరకు ముల్లర్‌ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని 20-పౌండ్ల కెటిల్‌ బెల్‌తో పాటు ఛాపర్ నుండి ఒక కేబుల్‌ను క్రిందికి వేలాడిదిపి అది ఎలా ఎగురుతుందో చూశాడు. పైగా ఆ ప్రయోగం ఆ ప్రశ్నకి సమాధానం 'డీ' గా భావించాడు. కానీ ఆ సమాధానం కూడా సృతప్తినివ్వక మళ్లా మళ్లా అదే ప్రయోగం చేశాడు. ఈ మేరకు అతను ఆ ప్రయోగానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఏఏపీటీ) సోషల్‌ మీడియాలో "కేబుల్‌పై గాలి రాపిడి ఉన్నందున, హెలికాప్టర్‌కు కేబుల్ జోడించే శక్తికి క్షితిజ సమాంతర భాగంలో ఉండాలి." అని ఒక పరిష్కారాన్ని పోస్ట్ చేసింది.

(చదవండి: వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి)

మరిన్ని వార్తలు