సచిన్‌,లారా రోడ్డు భద్రత పాఠాలు!

21 Mar, 2021 19:40 IST|Sakshi

వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకొవాలని ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై , ఇప్పటికి చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు.  అయితే, భారతమాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌, వెస్టిండీస్‌ ఆటగాడు బ్రియాన్‌ లారాతో కలిసి రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు.  ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. దీనిలో ‘ సచిన్‌ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ఎంత ముఖ్యమో... మైదానంలో​ క్రికెట్‌ ఆడేటప్పుడు కూడా హెల్మెట్‌ అంతే అవసరమని’ అన్నారు. సరైన హెల్మెట్‌ ధరించకపోవడంతో చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని, సరైన హెల్మెట్‌ ధరించాలని పేర్కొన్నారు. సచిన్‌ టెండుల్కర్‌ చేసిన సూచనలకు బ్రియాన్‌ లారా ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియోపై భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పందించారు..‘ ఈ వీడియోకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలని’ ఫన్నీగా కామెంట్‌ చేశారు.

అయితే, రోడ్‌సెఫ్టీ వరల్డ్‌ సిరిస్‌ టీ20 టోర్ని రాయ్‌పూర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో ఇండియా లెజెండ్స్‌, వెస్టిండీస్‌ లెజెండ్స్‌పై గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. దీనిలో సచిన్‌ 42 బంతుల్లో 65 పరుగులు చేశాడు. యువరాజ్‌ సింగ్‌ 20 బంతులలో 49 పరుగులు చేశారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండిస్‌ 206 పరుగులకే కుప్పకూలింది. 

చదవండి: రెండు శునకాల బెలూన్‌ ఆట.. చూస్తే వావ్‌ అనాల్సిందే!


 

మరిన్ని వార్తలు