జాంబియా తొలి అధ్యక్షుడు కన్నుమూత

18 Jun, 2021 12:54 IST|Sakshi

లుసాకా: జాంబియా దేశపు తొలి అధ్యక్షుడు కెన్నెత్‌ కౌండా కన్నుమూశారు. తన 97వ ఏట అనారోగ్యం కారణంగా గురువారం మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని దేశ అధ్యక్షుడు ఎడ్గర్‌ లుంగు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. జాంబియా వ్యాప్తంగా 21 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. కౌండా మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. కౌండా గౌరవించదగ్గ ప్రపంచనాయకుడని, రాజకీయనాయకుడని కొనియాడారు. కౌండా మరణంపై ఆయన కుమారుడు కమరంగే కౌండా ఫేస్‌బుక్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ మా నాన్నను కోల్పోయామని చెప్పటానికి నేను చింతిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు