సెక్యూరిటీ చీఫ్‌ని తొలగించిన జెలెన్ స్కీ!

30 May, 2022 13:41 IST|Sakshi

ఉక్రెయిన్‌ పై నిరవధిక దాడులతో రెచ్చిపోతున్న రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని తూర్పు నగరాలపై విధ్వంసం సృష్టించాయి. దీంతో దెబ్బతిన్న ఖార్కివ్‌ ప్రాంతాలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సందర్శించారు. ఆ ప్రాంతంలో నగరాన్ని పూర్తి స్థాయిలో రక్షించేందుకు ప్రయత్నించని ఒక సెక్యూరిటీ చీఫ్‌ని కూడా తొలగించారు. ఖార్కివ్‌లోని పరిసరా ప్రాంతాలన్ని చాలా వరకు  పూర్తిగా ధ్వంసమయ్యాయని జెలెన్‌ స్కీ అన్నారు.

అదీగాక రష్య కైవ్‌ని స్వాధీనం చేసుకోవడంలో విఫలమవ్వడంతో ఖార్కివ్‌ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గి తూర్పు డోన్‌బాస్‌ ప్రాంతం నుంచి దాడులు చేయడం ప్రారంభించింది.  ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని తూర్పువైపు దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. ఐతే జెలెన్‌ స్కీ మాత్రం చివరి వరకు మా దేశాన్ని రక్షించుకుంటామని పునరుద్ఘాటించటం విశేషం. అంతేకాదు ఖార్కివ్‌ ప్రాంతంలోని మూడో వంతు రష్యా అధినంలో ఉంది. పైగా రష్యా దళాల బాంబుల వర్షంతో విరుచుకుపడటంతో అక్కడ పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది. వేలాదిమంది పౌరులు చనిపోవడమే కాకుండా ఆ ప్రాంతాలకు వెళ్లడం కూడా కష్టతరంగా ఉందని స్థానిక గవర్నర్‌ పేర్కొన్నారు.

ఆయా ప్రాంతాల్లోని ఉక్రెయిన్‌ ఆయుధ డిపోలనే లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని క్రెయిన్‌వాసులు తాగు నీరు లేక, ఆహారం కొనగోలు చేసేందుకు డబ్బులు లేక అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు. దీంతో జెలెన్‌స్కీ ధ్వంసమైన ప్రాంతాలను పునర్మించే దిశగా స్థానిక అధికారులతో ప్రణాళికా చర్చలు జరిపారు. మరోవైపు రష్యా ఎగుమతులపై ఆంక్షలు పెంచేలా ఒత్తిడి చేసేందుకు ఈయూ నాయకులతో శిఖరాగ్ర సమావేశమయ్యారు. అంతేకాదు హంగేరి, క్రోయోషియా వంటి దేశాలు రష్యా నుంచి దిగుమతి చేసుకునే భూగర్భ ఆధారిత పైప్‌ లైన్‌ చమురు పైనే ఆధారపడి ఉంది. దీంతో ఈయూ శిఖారాగ్ర సమావేశంలో పైప్‌లైన్‌ ద్వారా సరఫరా అయ్యే చమురు పై కాకుండా ట్యాంకర్ల ద్వారా చమురు సరఫరా చేసే ప్రతిపాదనను తీసుకొచ్చారు.

(చదవండి: పుతిన్‌ బతికేది మరో మూడేళ్లే!.. తొలిసారి స్పందించిన రష్యా)

మరిన్ని వార్తలు