తన అంతరంగికుల చేతుల్లోనే పుతిన్‌ మరణం: జెలెన్స్కీ

27 Feb, 2023 14:34 IST|Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఏదో ఒకరోజు తన అంతరంగికుల చేతుత్లోనే మరణిస్తాడని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఈ వ్యాఖ్యలు "ఈయర్‌" అనే ఉక్రెయిన్‌ డాక్యుమెంటరీ లోనివని న్యూస్‌వీక్‌ తన కథనంలో పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఈ డాక్యుమెంటరీని విడుదల చేసినట్లు న్యూస్‌వీక్‌ తెలిపింది. ఈ మేరకు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌​ పుతిన్‌ నాయకత్వం బలహీనపడే సమయం ఆసన్నమైందన్నారు.

అతని సన్నిహితులే అతనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే పరిస్థితికి తీసుకువచ్చాడు. రష్యాలో పుతిన్‌ పాలనా దుర్భలత్వంపై విసుగు చెందే క్షణం వచ్చేసింది, అతని అతరంగికులే పుతిన్‌ని చంపేందుకు కారణాన్ని వెతికే పనిలో పడతారన్నారు. వారు కొమరేవ్‌, జెలెన్స్కీ వంటి పదాలను గుర్తు తెచ్చుకుంటూ.. చంపేందుకు యత్నిస్తుంటారన్నారు. పుతిన్‌పై అతని సన్నిహితులే విముఖంగా ఉన్నట్లు రష్యా నుంచి పలు నివేదికలు వచ్చిన నేపథ్యంలోనే జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

అదీగాక వాషింగ్టన్‌ కూడా ఇటీవలే పుతిన్‌ పట్ల విసుగు చెందుతున్నట్లు ఓ నివేదికలో పేర్కొంది. ఉక్రెయిన్‌ తన మాతృభూమిని నియంత్రణలోకి తెచ్చుకోవడంతోనే ఈ యుద్ధానికి ముగింపు పలుకుతుందని చెప్పారు. ఇది మా భూమి.. మా ప్రజలు.. మా చరిత్ర.. ఉక్రెయిన్‌లోని ప్రతి మూలకు ఉక్రెయిన్ జెండాను తిరిగి అందిస్తాం అని జెలెన్స్కీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఐతే జెలెన్స్కీ తాజా వ్యాఖ్యలపై రష్యా నుంచి ఇంకా స్పందన రాకపోవడం గమనార్హం. 
(చదవండి: ఇటలీ పడవ ప్రమాదంలో 24 మందికి పైగా పాకిస్తానీలు గల్లంతు)

మరిన్ని వార్తలు