చర్చల ప్రసక్తే లేదు...తెగేసి చెప్పిన జెలెన్‌స్కీ

15 Nov, 2022 15:34 IST|Sakshi

ఇండోనేషియా బాలిలో జరుగుతున్న​ జీ20 శిఖరాగ్ర సదస్సుకి వీడియో సమావేశంలో హాజరైన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ యుద్ధం ముగించేందుకు రష్యాతో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. అలాగే మిన్స్క్‌ 3 ఒప్పందాన్ని కూడా తోసి పుచ్చారు. పైగా రష్యా ఒప్పందం అంటూనే ఉల్లంఘిస్తూ.. ఉంటుందన్నారు. ఇది తూర్పు డోన్‌బాస్‌ ప్రాంతంలో కీవ్‌ మాస్కోల మధ్య విఫలమైన ఒప్పందానికి ఒక ఉదాహరణ అని జెలెన్‌స్కీ అన్నారు.

"రష్యా బలగాలు కీవ్‌లో దారుణమైన బీభత్సం సృష్టించాయి. ప్రపంచ అస్థిరతతో ఆటలాడింది, ఎన్ని విధాలుగా చెప్పిన వినలేదు  అందువల్ల తాము రష్యాతో చర్చలకు ఇష్టపడటం లేదు. అయినా ఒప్పందం జరిగిన వెంటనే ఉల్లంఘించడం రష్యాకు ఒక అలవాటు అని విమర్శించారు." వాస్తవానికి రష్యా మద్దతుగల వేర్పాటువాదులు, కీవ్‌ మధ్య యుద్ధ విరమణ కోసం జర్మనీ, ఫ్రాన్స్‌ 2014, 2015లలో మొదటిసారిగా మిన్స్క్‌ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

ఆ తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. అదీగాక ఇటీవలకాలంలో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు తక్కువగానే సాగాయి. జెలెన్‌స్కీ కూడా రష్యాతో చర్చించేందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది.  

(చదవండి: పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే.. మదర్‌ హీరోయిన్‌ అవార్డు!)

మరిన్ని వార్తలు