పారిపోలేదు!..నేను ఇక్కడే ఉన్నా! పోరాడుతున్నా: జెలెన్‌ స్కీ

5 Mar, 2022 11:39 IST|Sakshi

For the second time Ukrainian president Posted A Video: ఉక్రెయిన్‌ పై రష్యా చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని జనావాసాలు, పౌరుల పైన భీంకరంగా దాడి చేయడం మొదలు పెట్టింది. అంతేకాదు పలు నగరాలను స్వాధీనం చేసుకోవడమే కాక. ఐరోపాలోని అతి పెద్ద అణు కర్మాగారంపై కూడా దాడులకు తెగబడింది. దీంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పోలాండ్‌కు పారిపోయాడంటూ పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి.

మరోవైపు రష్యా రాజకీయ నాయకుడు వ్యాచెస్లావ్‌ వోలోదిన్‌ ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ సభ్యులకు జెలెన్‌ స్కీ అందుబాటులో లేరు ఆయన దేశ విడిచి పోలాండ్‌ వెళ్లిపోయాడని వెల్లడించారు. ఆఖరికి రష్య మీడియా సైతం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోయారని పేర్కొంది. దీంతో వోలోదిమిర్‌ జెలెన్‌ స్కీ తాను ఎక్కడికి పారిపోలేదని ఇక్కడే ఉ‍న్నానంటూ శనివారం మరోసార సెల్ఫీ వీడియోని పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో జెలెన్‌ స్కీ తాను కైవ్‌లోని ఉన్నానని, ఇక్కడే పని చేస్తున్నాను ఎవరు పారిపోలేదని చెప్పారు.

అయితే ఉక్రెయిన్‌లో నెలకొన్న భయంకరమైన ఉద్రిక్తల నడుమ జెలెన్‌స్కీ యూఎస్‌ తరలింపు ప్రతిపాదనను సైతం అంగీకరించారంటూ వదంతులు పెద్ద ఎత్తున​ దుమారం రేపాయి. మరోవైపు జెలెన్‌ స్కీ ఉక్రెయిన్‌ని విడిచి పెట్టను తగ్గేదేలే అంటూ ఆయన గట్టి కౌంటరిస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఆయన తన కైవ్‌ కార్యాలయంలో నుంచి తీసిన ఒక సెల్ఫీ వీడియో సందేశంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అంతేకాదు ఈ వీడియో సందేశంలో ఉక్రెయిన్‌ పై నో ఫ్లై జోన్‌ను అమలు చేయకూడదనే నాటో నిర్ణయాన్ని కూడా తప్పుబట్టారు. 

A post shared by Володимир Зеленський (@zelenskiy_official)

(చదవండి: రష్యన్‌ డ్రోన్‌ విధ్వంసం: వైరల్‌ వీడియో)

మరిన్ని వార్తలు