యుద్ధ సమయంలో ఆఫ్రికన్‌ దేశాలకు ఉక్రెయిన్‌ చేయూత

27 Nov, 2022 20:55 IST|Sakshi

రష్యా దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌ ఆఫ్రికన్‌ దేశాలు ఎదుర్కొంటున్న ఆహార కొరతకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.  ఈ మేరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లొదిమిర్‌ జెలెన్‌ స్కీ తీవ్ర కరువును ఎదుర్కొంటున్న దేశాలకు సుమారు 150 మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు గ్రెయిన్‌ ఫ్రమ్‌ ఉక్రెయిన్‌ పథకాన్ని ప్రారంభించారు. ఉక్రెయిన్‌ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశించే మిలియన్ల మంది ప్రజలు విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

1923-33 శీతాకాలంలో మిలియన్ల మంది ఉక్రెయిన్లను ‍పొట్టనబెట్టుకున్న రష్యా యుగం​ నాటి కరువు హోలోడోమోర్‌ కోసం జరిగిన ఉక్రెయిన్‌ వార్షిక స్మారక దినం సందర్భంగా ఈ ఫథకాన్ని ప్రారంభించారు. తమతో యుద్ధానికి దిగి ఆఫ్రికాలో ఆహార తీవ్ర ఆహార కొరతకు కారణమైందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయంటూ రష్యా రకరకాల కథనాలను వెలువరిస్తుంది. దీంతో వాటన్నింటిని తిప్పికొట్టేలా తాజాగా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఉక్రెయిన్‌.

ఈ మేరకు ఇథియోఫియా, సూడాన్‌, సౌత్‌సూడాన్‌, సోమాలియా, యెమెన్‌లతో సహా దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం యూరోపియన్‌ యూనియన్‌తో సహా 20కి పైగా దేశాల నుంచి సుమారు రూ.150 మిలయన్‌ డాలర్లను సేకరించిందని జెలెన్‌స్కీ చెప్పారు. కరువు ముప్పును ఎదుర్కొంటున్న దేశాలకు ఉక్రెనియన్‌ ఓడరేవుల నుంచి కనీసం 60 నౌకలను పంపాలని ప్లాన్‌ చేస్తున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ రాజధానిలో లక్షలాది మంది విద్యుత్‌ కొరతను ఎదుర్కొటున్నారని చెప్పారు.

అంతేగాక ఉక్రెయిన్‌లోని 27 ప్రాంతాలలో 14 ప్రాంతాల్లో విద్యుత్‌ వినియోగంపై ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. అదీగాక మాస్కో దళాలు ఖేర్సన్‌ నగరం నుంచి వైదొలగినప్పటికీ షెల్లింగ్‌ దాడులు కొనసాగిస్తూనే ఉందని, ఈ దాడిలో సుమారు 32 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఏదీఏమైనా రష్యా ఉక్రెయిన్‌పై పదేపదే ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా యూఎన్‌ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్‌ నల్ల సముద్రపు ఓడరేవుల నుంచి ఎగుమతి చేసిన ఆహారం అత్యంత తీవ్ర స్థాయిలో ఆహార కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు చేరడం లేదంటూ రష్యా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ పథకాన్ని ప్రకటించారు. 

(చదవండి: ఉక్రెయిన్‌కి సునాక్‌ మద్దతు హామీ)

మరిన్ని వార్తలు