Russia Ukraine War: వాళ్ల మాటలు నమ్మకండి: జెలెన్‌ స్కీ వార్నింగ్‌

2 May, 2022 07:08 IST|Sakshi

ఉక్రెయిన్‌లో రెండు నెలలకుపైగా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు, సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. ఇరు దేశాల మధ్య పలుమార్లు శాంతి చర్చలు జరిగినా అవి విఫలమే అ‍య్యాయి. 

ఇదిలా ఉండగా.. రష్యా సైనిక కమాండర్ల మాయమాటలు నమ్మి యుద్ధానికి దిగి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆ దేశ సైనికులకు, యువతకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సూచించారు. యుద్ధంలో మరణిస్తారని, గాయపడతారని తెలిసి కూడా సరైన శిక్షణ లేని యువకులను బలవంతంగా ఉక్రెయిన్‌కు పంపిస్తున్నారని మండిపడ్డారు. తమ భూభాగంలో అడుగుపెట్టి ప్రాణాలు కోల్పోవద్దని, సొంత దేశంలోనే ఉండిపోవడం మంచిదని చెప్పారు. 

జెలెన్‌స్కీతో నాన్సీ పెలోసీ భేటీ 
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ జెలెన్‌స్కీతో కీవ్‌లో సమావేశమయ్యారు. పలువురు అమెరికా చట్టసభ సభ్యులు కూడా ఆమెతో పాటు ఉన్నారు. స్వేచ్ఛకోసం పోరాడుతున్న ఉక్రెయిన్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చామని పెలోసీ చెప్పారు. పోరాటం ముగిసేదాకా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామన్నారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే నాన్సీ పెలోసీ ఉక్రెయిన్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా దండయాత్రను ఉక్రెయిన్‌ ప్రజల ధైర్యంగా, గుండెనిబ్బరంతో ఎదుర్కొంటున్నారని ఆమె ప్రశంసించారు. 

ఇది కూడా చదవండి: క్షీణించిన పుతిన్‌ ఆరోగ్యం.. ఈ వారంలో ఆపరేషన్‌..?

మరిన్ని వార్తలు