సీరియల్‌ కిల్లర్‌ వాడిన 50 ఏళ్ల నాటి కోడ్‌ను శోధించారు

12 Dec, 2020 08:44 IST|Sakshi

న్యూయార్క్‌: దాదాపు 50 ఏళ్ల క్రితం ‘జోడియాక్‌ కిల్లర్‌’గా ప్రసిద్ధి చెందిన ఓ నిందితుడు పంపిన కోడ్‌ మెసేజ్‌ను డీకోడ్‌ చేశామని క్రిప్టోగ్రాఫిక్‌ (సంకేతాలను విశ్లేషించి మామూలు భాషలో రాయడం)ఔత్సాహికులు వెల్లడించారు. ఈ వ్యక్తి 1960 ప్రాంతంలో ఉత్తర కాలిఫోర్నియాలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాడు. సదరు కిల్లర్‌ ఈ సందేశాన్ని నవంబర్ 1969 లో శాన్‌ఫ్రాన్సిస్‌కో క్రానికల్ వార్తాపత్రికకు పంపించాడు. ఈ సందేశం క్రిప్టిక్‌ లెటర్స్‌, సింబల్స్‌ కలిగి ఉన్నది. ఇక ఈ మెసేజ్‌లో సీరియల్‌ కిల్లర్‌కు సంబంధించి ఏదైనా ఐడెంటీ ఉంటుందని అధికారలు భావించారు. 1968-69 మధ్య ఈ సీరియల్‌ కిల్లర్‌ ఐదు హత్యలకు పాల్పడ్డాడు. అయితే ఇతడిని ఆదర్శంగా తీసుకుని మరి కొందరు సీరియల్‌ కిల్లర్స్‌ మరో 37 మందిని హత్య చేశారు. ఈ కేసులు అధికారులకు పెద్ద సవాలుగా మారాయి. దాదాపు 50 ఏళ్ల ప్రయత్నం తర్వాత సదరు కిల్లర్‌ పంపిన మెసేజ్‌ను తాము చేధించినట్లు ముగ్గురు వ్యక్తులు వెల్లడించారు. 

అయతే ఈ కోడ్‌లో హంతకుడికి సంబంధించి ఎలాంటి గుర్తింపు గానీ, ఆధారాలు గానీ లేవని ఈ బృందం వెల్లడించింది. ఈ మెసేజ్‌లో "మీరు నన్ను పట్టుకోవటానికి చాలా సరదాగా ఉన్నారని నేను నమ్ముతున్నాను... గ్యాస్ చాంబర్ గురించి నేను భయపడను, ఎందుకంటే అది నన్ను త్వరగా స్వర్గానికి పంపుతుంది. ప్రసుతం నేను లేకపోయినా నా పని పూర్తి చేయడానికి తగినంత మంది బానిసలు ఉన్నారు" అనేది ఈ మెసేజ్‌లోని సారాంశం. ఈ కోడ్‌ని చేధించడానికి క్రిప్టోగ్రాఫర్‌లు సంవత్సరాల తరబడి పని చేశారు. అమెరికన్‌ వెబ్‌ డిజైనర్‌ ఓరన్‌చాక్‌ 2006 నుంచి ఈ కోడ్‌ను డీకోడ్‌ చేయడానికి అనేక కంప్యూటర్‌ ప్రొగ్రామ్‌లను ఉపయోగించాడు. కానీ లాభం లేకపోయింది. ఈ ప్రయత్నంలో అతడికి ఆస్ట్రేలియా గణిత శాస్త్రజ్ఞుడు సామ్ బ్లేక్, బెల్జియన్ లాజిస్టిషియన్ జార్ల్ వాన్ ఐక్కే సహాయం చేశారు. ఈ సందర్భంగా ఓరన్‌ చాక్‌ శాన్‌ఫ్రాన్సిస్‌కో క్రానికల్‌తో మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న ఫెడరల్‌ ఏజెన్సీ ఎఫ్‌బీఐతో కలిసి ఈ కోడ్‌ని పరిష్కరించామన్నారు. (చదవండి: ‘వీక్‌ అని గేలి చేశారు.. అందుకే)

ఇక సదరు జోడియాక్‌ కిల్లర్‌ కాలిఫోర్నియా వార్తాపత్రికలకు పంపిన మొదటి సందేశాన్ని 1969 లో పాఠశాల ఉపాధ్యాయుడు,అతని భార్య డీకోడ్ చేశారు. దానిలో ‘‘చంపడం అంటే నాకు ఎంతో ఇష్టం.. దానిలో ఎంతో ఫన్‌ ఉంది’’ అని సారాంశం కలిగి ఉంది. ఇక ఈ మెసేజ్‌లో కూడా అతడు బానిసలు అనే పదం వాడాడు. మొదటి సందేశంలో ఉపయోగించిన కోడ్ "340 సాంకేతిక లిపి" చాలా సరళంగా ఉంది. ఎందుకంటే ఈ కోడ్‌ 17 నిలువు వరుసలలో 340 అక్షరాలను కలిగి ఉన్నాయి. "జోడాయిక్‌ క్రిప్టో సొసైటీలో సంకేతాలకు ఏ అక్షరాలు ఉన్నాయో గుర్తించడానికి మించి సాంకేతికలిపికి మరో అడుగు ఉంది. అదే విషయాన్ని మేము ఇక్కడ కనుగొన్నాము" అని ఓరన్‌చక్ అన్నారు.(చదవండి: చిన్ననాటి కోరిక.. 93 మందిని..!)

‘‘340 సాంకేతికలిపిని డయాగ్నల్‌గా చదవాలి. అంటే ఎగువ-ఎడమ మూలలో నుంచి ప్రారంభించి, ఒక బాక్స్‌ క్రిందికి, రెండు బాక్స్‌లను కుడి వైపుకు మారుస్తుంది. కిందకు చేరుకున్న తర్వాత రీడర్ తప్పనిసరిగా వ్యతిరేక మూలకు వెళ్ళాలి’’ అని నిపుణుడు తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పారు. అతని ప్రకారం, జోడియాక్‌ కిల్లర్‌ వాడిన కోడింగ్ విధానం ముఖ్యంగా 1950 కాలంలో అమెరికా సైన్యం వాడిన క్రిప్టోగ్రఫీ మాన్యువల్‌లో కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు