ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి

4 Apr, 2021 16:41 IST|Sakshi

జకార్తా: తూర్పు ఇండోనేషియాలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల కనీసం 44 మంది మృతి చెందారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారని విపత్తు సహాయ సంస్థ తెలిపింది. ఇంకా చాలా మంది తప్పిపోయినట్లు పేర్కొంది. తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత లామెనెలే గ్రామంలోని అనేక ఇళ్లపై కొండచరియలు విరిగి పడ్డాయి. అయితే, ఈ శిథిలాల కింద 38 మృతదేహాలను, ఐదుగురు గాయపడిన వారిని గుర్తించినట్లు స్థానిక విపత్తు సంస్థ అధిపతి లెన్ని ఓలా తెలిపారు.

ఒయాంగ్ బయాంగ్ గ్రామంలో 40 ఇళ్ళు ధ్వంసమవడంతో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షం కారణంగా ఇళ్ళ మునిగిపోవడంతో వారి ఇళ్లను విడిచిపెట్టి వందలాది మంది పారిపోయారు. ఇండోనేషియాలో ప్రతి సంవత్సరం కాలానుగుణ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, భారీ వరదలు సంభవిస్తుంటాయి. ఇండోనేషియా అనేక ద్విపాల సమూహం ఇక్కడ మిలియన్ల మంది ప్రజలు పర్వత ప్రాంతాలలో లేదా సారవంతమైన వరద మైదానాల సమీపంలో నివసిస్తున్నారు. వరదల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

చదవండి:

బంగ్లాదేశ్‌లో 7 రోజుల లాక్‌డౌన్‌

సచిన్‌వాజే కేసులో వెలుగులోకి కీలక అంశాలు

Read latest Interview News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు