కోరుట్లలో ‘డీజే టిల్లు’ నేహాశెట్టి సందడి

11 Mar, 2023 09:08 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నేహాశెట్టి

కోరుట్ల: సినీనటి నేహాశెట్టి, మాల్‌ యజమాని ధన్‌పాల్‌ సూర్యనారాయణతో కలిసి శుక్రవారం పట్టణంలోని కిసాన్‌ ఫ్యాషన్‌ మాల్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. వినియోగదారుల కేరింతల మధ్య వస్త్రాల కౌంటర్లు సందర్శించారు. పట్టు చీరలు నాణ్యంగా, మన్నికగా ఉన్నాయని ప్రశంసించారు. సరికొత్త వైరెటీలతో పట్టు చీరలు, సంప్రదాయ దుస్తులు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్త పెళ్లి కూతుళ్ల కోసం అన్ని వైరెటీలు తక్కువ ధరలకే లభిస్తాయని అన్నారు. అనంతరం షాపింగ్‌ మాల్‌ ఎదుట ఏర్పాటు చేసిన స్టేజీపై నేహాశెట్టి.. డీజే టిల్లు పాటపై స్టెప్పులు వేయడంతో జనం జోష్‌తో కేరింతలు కొట్టారు. పట్టణంతోపాటు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.

జై జవాన్‌..జై ‘కిసాన్‌’ లక్ష్యం
యాభై ఏళ్ల క్రితం రైతులకు అవసరమైన మన్నికై న వస్త్రాలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన కిసాన్‌ ఫ్యాషన్‌ మాల్‌ నేడు ఏడు బ్రాంచీలతో అన్నిరకాల వస్త్రాలకు నిలయంగా మారిందని యజమాని ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడ కిసాన్‌ ఫ్యాషన్‌ మాల్‌ ప్రారంభించినా ఆ ప్రాంతానికి చెందిన సుమారు 200 మందికి ఉపాధి కల్పించడంతోపాటు అన్నిరాయితీలు కల్పిస్తామని అన్నారు.

జిల్లా నడుబొడ్డున కోరుట్ల ఉందని, అందుకే జిల్లావాసులు అందరికీ అందుబాటులో ఉండేలా కిసాన్‌ ఫ్యాషన్‌మాల్‌ ప్రారంభించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య–అనిల్‌, వైస్‌ చైర్మన్‌ గడ్డమీద పవన్‌, కౌన్సిలర్‌ ఆడెపు కమల–మధు, కిసాన్‌ ఫ్యాషన్‌ మాల్‌ భవన యజమాని, వ్యాపారవేత్త పడాల నారాయణగౌడ్‌, షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులు ఉదయ్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, వినయ్‌కుమార్‌, నవీన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు