ఉద్యోగులకు అండగా కేసీఆర్‌ సర్కార్‌

16 Sep, 2023 23:12 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌: సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు అండగా ఉంటున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నా రు. తెలంగాణ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మోతెరోడ్డులోని బీఆర్‌ఎస్‌ కా ర్యాలయంలో శనివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం రమేశ్‌, నియోజకవర్గ అధ్యక్షుడు మామిడిపల్లి ఉమేశ్‌, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, కోశాధికారి సదానందం, గౌరవ అధ్యక్షుడు ఎం.నజీర్‌ పాల్గొన్నారు.

ప్రజల గుండెల్లో గులాబీ జెండా

ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఉందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. చల్‌గల్‌కు చెందిన 100 మంది యువకులు, మహిళలు, లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన 20 మంది నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా ఆయన ఆహ్వానించారు. అనంతరం వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. నాయకులు దావ సురేశ్‌, మహిపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, గంగనర్సు, జాన్‌, సునీత, తిరుపతి, సౌజన్య ఉన్నారు.

పేదల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ధ్యేయం

రాయికల్‌(జగిత్యాల): పేదల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్‌ అన్నారు. వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు