ఓటుతో అవినీతిపరులకు గుణపాఠం చెప్పాలి

21 Aug, 2023 01:52 IST|Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఓటుతో అవినీతిపరులైన పాలకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు వడ్లకొండ పరుశరాములు అన్నారు. డివిజన్‌కేంద్రంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఘన్‌పూర్‌ నియోజకవర్గం 1978లో ఎస్సీ రిజర్వేషన్‌ అయిందని, నాలుగున్నర దశాబ్ధాలు గడుస్తున్న ఎస్సీల అభివృద్ధిని పట్టించుకున్న పాలకులు లేరన్నారు. నాటి నుంచి నేటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారందరూ కేవలం రిజర్వేషన్‌ను వినియోగించుకుని తమ ఆస్తులు కూడబెట్టుకున్నారే తప్ప నియోజకవర్గానికి, ఎస్సీలకు చేసిందేమి లేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంలుగా పనిచేసినా నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వడ్లకొండ యాకయ్య, రంగు వెంకన్న, ఐత శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు