మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

9 Mar, 2023 04:12 IST|Sakshi
మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

గద్వాల రూరల్‌: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి సీ్త్రలకు ఉందని జెడ్పీ చైర్‌పర్సన్‌ కె.సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సమతా సేవా సమితి అధ్యక్షురాలు బండ్ల జ్యోతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్‌కే ఫంక్షన్‌లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతిప్రజ ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జెడ్పీచైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి వివిధ రకాల పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎనిమిది రకాల రోగనిర్ధారణ చేసే మహిళా ఆరోగ్య పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. అదేవిధంగా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేసిన గత ప్రభుత్వాలకు భిన్నంగా సీఎం కేసీఆర్‌ ఆకాశంలో సగభాగమైన మహిళలకు అన్ని రకాలుగా చేయూతనిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. పేదింట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే భయపడే పరిస్థితిని పోగొట్టి కల్యాణాలక్ష్మీ, షాదీముభారక్‌ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

ఆరోగ్యానికి ప్రాధాన్యం

సమతాసేవ సమితి అధ్యక్షురాలు ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు కేసీఆర్‌, న్యూట్రిషన్‌ కిట్లు అందజేస్తూ వారి ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, ఎంపీపీలు మనోరమ్మ, నజీమున్నీసాబేగం, జెడ్పీటీసీలు శ్యామల, కౌన్సిలర్లు శ్వేతా, లక్ష్మీనర్సమ్మ, గీత, నాగలత, అరుణ, మహేశ్వరి, జయమ్మ, గిరిజ, రామేశ్వరి పాల్గొన్నారు.

జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత,ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

జిల్లాలో ఘనంగాఅంతర్జాతీయ మహిళా దినోత్సవం

మరిన్ని వార్తలు