17న జిల్లాకు కేంద్ర మంత్రి అమిత్‌షా రాక

14 Nov, 2023 01:42 IST|Sakshi

గద్వాల రూరల్‌: ఈ నెల 17వ తేదీన కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షా గద్వాలకు రానున్నట్లు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారని గద్వాలలో బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలిపారు. అదేవిధంగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీరాములయ్య ఈనెల 15వ తేదీన గద్వాలకు రానున్నట్లు తేరుమైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలకు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రామాంజనేయులు, సంజీవ్‌భరద్వా జ్‌, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు