ప్రత్యేక వాహనాల్లో తరలింపు

2 Dec, 2023 01:38 IST|Sakshi

టరు తీర్పతో నిక్షిప్తమైన ఈవీఎంలను అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక వాహనాల్లో తరలించారు. అలంపూర్‌ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఎన్నికల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న గోదాంలలోనే ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూంలో భద్రపర్చడం జరిగింది. ఇక్కడి నుంచే నియోజకవర్గంలోని ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల అధికారులకు పంపిణీ చేశారు. తిరిగి ఇక్కడ కౌంటర్‌ను ఏర్పాటు చేసి ఓటరు తీర్పుతో వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్వీకరించారు. అనంతరం స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. స్ట్రాంగ్‌లో భద్రపర్చిన ఎన్నికల ఓటరు తీర్పు నిక్షిప్తమైన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి చంద్రకళ, ఇతర అధికారులు, అభ్యర్థులకు సంబందించిన వారి సమక్షంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రభుత్వ ప్రత్యేక వాహనాల్లో కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చంద్రకళ అధ్వర్యంలో పార్టీల అభ్యర్ధులు, అభ్యర్ధుల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలను తెరిచారు. వారి సమక్షంలో సిబ్బంది ఓటరు తీర్పు నిక్షిప్తమైన 290 ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ప్రభుత్వ ప్రత్యేక వాహనంలో తరలించారు. పోలింగ్‌ యంత్రాలు, వాటినికి సంబంధించిన పత్రాలను, యంత్రాలను సైతం అందులో ఉంచి అందరి సమక్షంలో ఎన్నికల రిటర్నిగ్‌ అధికారి వాహన తలుపులకు తాళం వేసి సీల్‌ వేశారు.

మరిన్ని వార్తలు