స్వల్పంగా పెరిగిన ఓటింగ్‌ శాతం

3 Dec, 2023 00:52 IST|Sakshi
అలంపూర్‌లోని స్ట్రాంగ్‌ రూం నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లు తరలిస్తున్న అధికారులు (ఫైల్‌)

అలంపూర్‌: మరికొన్ని గంటల వ్యవధిలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల నుంచి బహిర్గతం కానుంది. గత మూడు రోజుల నిరీక్షణకు.. ఫలితాల లెక్కింపుతో తెరపడనుంది. గద్వాల జిల్లా కేంద్రంలోని గోనుపాడులోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, పోలింగ్‌ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే సర్వత్రా చర్చ సాగుతుంది. అలంపూర్‌ అసెంబ్లీ స్థానానికి 13 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా విజయుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి గా డాక్టర్‌ ఎస్‌ఏ సంపత్‌ కుమార్‌, బీజేపీ అభ్యర్ధిగా పెరుమాళ్లు రాజగోపాల్‌, బీసీవై అభ్యర్ధిగా అయ్యప్పగారి సునీల్‌ తదితరులు ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగింది.

స్వల్పంగా పెరిగిన ఓటింగ్‌ శాతం

అలంపూర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 82.50 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 2,37,938 మంది ఓటర్లు ఉండగా, 1,96,307 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల పోలింగ్‌తో పోల్చితే ఈ సారి పోలింగ్‌ శాతం 0.19 శాతం పెరిగింది. దీంతో పెరిగిన స్వల్ప ఓట్లు ఎవరికి లాభం చేస్తాయి. ఎవరికి నష్టం కలిగిస్తాయో అనే చర్చ సాగుతుంది.

గోనుపాడులో ఓట్ల లెక్కింపు

మరిన్ని వార్తలు