కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఆంక్షలు..

3 Dec, 2023 00:52 IST|Sakshi

కౌంటింగ్‌ కేంద్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు ఒకటి లేదా రెండు టేబుళ్లను కేటాయించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి కౌంటింగ్‌ ఏజెంట్ల సెల్‌ఫోన్లకు అనుమతి లేదు. అలాగే కౌంటింగ్‌ సమయంలో ఒకరికి బదులుగా మరొకరు వెళ్లడం కానీ, ఏజెంట్‌ రిలీవింగ్‌ను అనుమతించడం లేదు. ఒక్కో టేబుల్‌ వద్ద ఒకరి చొప్పున కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఒక అసిస్టెంట్‌ సూపర్‌ వైజర్‌, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉండనున్నారు. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌ ప్రారంభం కానుండగా, అంతకుముందు నుంచే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేయనున్నారు. కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి వేర్వేరుగా కౌంటింగ్‌ కేంద్రాలు, పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు.

మరిన్ని వార్తలు