సత్యదేవునికి వెండి సామగ్రి సమర్పణ

24 Feb, 2023 23:42 IST|Sakshi

అన్నవరం: సత్యదేవునికి పి.శ్రీనివాస్‌ దంపతులు (హైదరాబాద్‌) శుక్రవారం రూ.2 లక్షల విలువైన 1.50 కిలోల వెండితో పళ్లెం, నాలుగు కప్పుల పంచపాత్ర, చెంబు, రూ.2 లక్షల విరాళం సమర్పించారు. గడచిన నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరాయంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే ఈనాడు అధినేత రామోజీరావు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత మండిపడ్డారు. కిర్లంపూడి మండలం జగపతినగరంలో ప్రధాన రహదారిపై ఎంపీ గీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, వైఎస్సారీ సీపీ నాయకులు కలిసి ఈనాడు ప్రతులను దహనం చేశారు.

కాకినాడ సిటీలో వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి సూర్యారావుపేట ఘంటసాల విగ్రహం సెంటర్‌ వరకూ రామోజీరావు దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. అనంతరం రామోజీరావు దిష్టిబొమ్మను కాళ్లతో తొక్కి, చెప్పులతో కొట్టి, దహనం చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్‌, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ, జర్నలిస్టు విలువలకు రామోజీరావు తిలోదకాలిచ్చి, ఇష్టానుసారం వార్తలను వక్రీకరించి రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న ప్రభుత్వంపై అబద్ధాలు, అభూత కల్పనలతో అనునిత్యం విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును వెనకేసుకు వచ్చేందుకు పత్రికా విలువలను కాలరాస్తున్నారని అన్నారు.

మరిన్ని వార్తలు