జార్జిపేట మహాలక్ష్మి అమ్మవారికి భారీ సారె

24 Feb, 2023 23:42 IST|Sakshi
సారెను సమర్పించేందుకు వచ్చిన గ్రామ ఆడపడుచులు

తాళ్లరేవు: జార్జిపేట గ్రామదేవత మహాలక్ష్మి అమ్మవారికి సుమారు రెండు వేలమందికిపైగా గ్రామ ఆడపడుచులు సారెను సమర్పించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. వేద పండితులు వాడపల్లి గోపాలచార్యులు నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 7.51 గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖర ప్రతిష్ఠ వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన గ్రామ ఆడపడుచులు అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి పసుపు, కుంకుమ, చీరలు, చలివిడి, పానకం, అరటిపండ్లు తదితర వస్తువులతో కూడిన సారెను సమర్పించారు. స్థానిక దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా వచ్చి సారెను సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. జార్జీపేట గ్రామం నుంచే కాక పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది.

మరిన్ని వార్తలు