రైతులను ముంచిన ఈదురుగాలులు

21 Mar, 2023 02:14 IST|Sakshi

పలుచోట్ల ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు

నేలరాలిన మామిడి కాయలు

కాకినాడ సిటీ: జిల్లాలో సోమవారం వీచిన బలమైన ఈదురుగాలులు ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా మామిడి రైతులను నష్టపరిచాయి. శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం, కొన్ని మండలాల్లో వడగళ్ల వాన పడడంతో పంటనష్టం వాటిల్లింది. పంట చేతికి వస్తుందనుకున్న తరుణంలో ప్రకృతి తమపై కన్నెర్ర జేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు చోట్ల వడగళ్ల వాన కురిసింది. వరిపంట నేలనంటిందని పలు ప్రాంతాల్లో రైతులు వాపోయారు. ఇప్పుడిప్పుడే కోతదశకు వస్తున్న మామిడి ఈదురుగాలులకు నేల రాలడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న, కాయగూరల పంటలను నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

రైతులు ఆందోళన

ఏలేశ్వరం, ప్రత్తిపాడు, తొండంగి, కిర్లంపూడి తుని, కోటనందూరు, కత్తిపూడి, జగ్గంపేట, పెద్దాపురం, గొ ల్లప్రోలు, పిఠాపురం కరప తదితర ప్రాంతాల్లో ఈదు రుగాలులు ప్రభావం చూపాయి. కొద్డిపాటి వర్షం కూ డా పడింది. మామిడి తోటలకు ఎక్కువగా నష్టం సంభవించిందని రైతులు చెప్పారు. ఈదురుగాలులకు రాలిపోయిన మామిడికాయలను ఏరుకుని గుట్టలు పెట్టుకునే పనిలో వీరంతా నిమగ్నమై కనిపించారు. ఏలేశ్వరం.. తొండంగి మండలాల్లో కొన్ని చోట్ల విద్యు త్‌ స్తంభాలు నేలకొరిగాయి. జిల్లాలో 13.8 మిల్లీమీట ర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. ఏలేశ్వరం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. తాళ్లరేవు మండలంలో అత్యల్ప వర్షపాతం 1.4 మిల్లీమీటర్లు కురిసింది. పెదపూడి మండలంలో వర్షం కురవలేదు. సోమవారం కురిసిన వర్షపాతం వివరాలు మండలాల వారీ మిల్లీమీటర్లలో ఇలా ఉన్నాయి. ఏలేశ్వరం 39.4, ప్రత్తిపాడులో 33, తొండంగి 32.2, కిర్లంపూడి 23.2, రౌతులపూడి 21.8, శంఖవరం 21.4, గొల్లప్రోలు 19.8, జగ్గంపేట 13.6, కరప 12.2, పిఠాపురం 11.2, తుని 10.6, కోటనందూరు 9.8, యూ కొత్తపల్లి 9.4, గండేపల్లి 9, కాకినాడ అర్బన్‌ 8.2, పెద్దాపురం 5.4, కాజులూరు 3.2, కాకినాడ రూరల్‌ 3, సామర్లకోట 2, తాళ్లరేవు 1.4 మిల్లీమీటర్ల నమోదైంది.

మరిన్ని వార్తలు