జిల్లా స్థాయి స్పందనకు 243 అర్జీలు

21 Mar, 2023 02:14 IST|Sakshi
స్పందన కార్యక్రమంలో అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ

కాకినాడ సిటీ: ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో డీఆర్వో కె శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, కెఎస్‌ఈజెడ్‌ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ కె మనోరమ, డీఆర్‌డీఏ పీడీ కె శ్రీరమణిలతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి 243 అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా జేసీ ఇలక్కియ మాట్లాడుతూ ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధేవ గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుని సమస్యకు సంబంధించిన ఫోటోలతో తప్పనిసరిగా జత చేయాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులకు మార్గనిర్ధేశనం చేస్తూ అర్జీలు పరిష్కారమయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్‌ వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.

పోలీస్‌ స్పందనకు 43 ఫిర్యాదులు

కాకినాడ క్రైం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి 43 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు తెలిపారు. వీటిలో సివిల్‌ వివాదాలకు సంబంధించి 16, కుటుంబ తగాదాలవి 8 ఇతర సమస్యలకు సంబంధించి19 ఫిర్యాదులు ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తలు