ఇదీ పంచాంగం

22 Mar, 2023 01:12 IST|Sakshi
ఉగాది పర్వదిన సందర్భంగా ముస్తాబైన వాడపల్లి వెంకటేశ్వరుని ఆలయం

పంచాంగం ద్వారా ఎన్నో విశేషాలు తెలుస్తున్నా– తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదూ దానిలో ప్రధానమైన అంగాలు. అవి వరుసగా శ్రేయస్సు, ఆయువు, పాపవిముక్తి, రోగ నివారణ, కార్యసిద్ధికి సంబంధించినవి. ఆ అయిదింటి శుభ అశుభ ఫలితాలను పంచాంగం వెల్లడిస్తుంది. నిత్యం పూజావిధిలో ఆ అయిదు అంగాలనూ సంకల్పంలో చెబుతారు. తెలుగువారి పంచాంగాలకు చాంద్రమానం ఆధారం. చంద్రుడి నడకనే చాంద్రమానం అంటారు. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. అంటే పదహారు కళలున్నవాడు. వాటినే తిథులు అంటారు. పంచాంగంలో రెండో విభాగం– వారం. ఆదివారం నుంచి శనివారం వరకూ ఏడు వారాలవి. నక్షత్రం అనేది పంచాంగంలో మూడో విభాగం. నాలుగోది యోగం. యోగాలూ ఇరవై ఏడే. ఇక అయిదోది కరణం. ఇది పంచాంగంలో ఆఖరి భాగం. కరణాలు మొత్తం 11. వీటిలో మొదటిదైన భవకరణం ఎంతో శుభప్రదం. మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో లోతైనవి, చాలా విలువైనవి. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాల్లో వాటికి పట్టింపు ఎక్కువ.

మరిన్ని వార్తలు