-

బాలికపై లైంగిక దాడి కేసులో ఐదేళ్ల జైలు

10 Mar, 2023 01:50 IST|Sakshi

నిజామాబాద్‌ లీగల్‌: బాలికపై శరీర స్పర్శ ద్వారా లైంగిక దాడి చేసిన ఓ నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ పోక్సో కోర్టు స్పెషల్‌ జడ్జి శ్రీనివాస్‌రావు గురువారం తీర్పు వెల్లడించారు. ఆ ర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ అధికారి తెలిపిన వివరా లు ఇలా.. డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామానికి చెందిన కోటి మల్లేశ్‌, ఆర్మూర్‌ దగ్గర పిల్లగుట్టలోని మామిడితోటలోగల ఒక ఇంటిలో నివా సం ఉంటూ కూలీ పనిచేసుకునేవాడు. బోధన్‌లోని రాకాసిపేటకు చెందిన ఒక వ్యక్తి తన భార్య మరణాంతరం ముగ్గురు పిల్లలతో కలిసి బతుకు తెరువుకోసం ఆర్మూర్‌ పిప్రిగల్లీకి వెళ్లి ఒక యాజమాని దగ్గ ర బర్ల కాపరిగా పనిచేసేవాడు. ఇల్లు కిరాయికి దొర కకపోవడంతో తన తమ్ముడి స్నేహితుడైన మల్లేశ్‌ ఇంటిలో తన ముగ్గురు పిల్లలతో ఉండేవాడు. అత ను లేనిసమయంలో మల్లేశ్‌ ఆ వ్యక్తి తొమ్మిదేళ్ల కూ తురును రాత్రి సమయంలో లైంగిక దాడికి గురిచేసేవాడు. దీంతో నిందితుడిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువు కావ డంతో మల్లేశ్‌కు భారత శిక్ష్యాస్కృతి సెక్షన్‌ 354 ఎ ప్రకారం రెండు సంవత్సరాల జైలుశిక్ష , రూ.5వేల జరిమానా, పోక్సో చట్టం సెక్షన్‌ 7 ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. ఆర్మూర్‌ పోలీస్‌ కార్యాలయ అధికారి తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పిడుగు రవిరాజ్‌ ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు.

మరిన్ని వార్తలు