వైన్ షాపులో దర్జాగా దొంగతనం...

23 Mar, 2023 00:44 IST|Sakshi
వైన్స్‌లో చోరీకి పాల్పడుతున్న వ్యక్తి

జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో ఇంటికి తాళా లు వేసి వెళ్తే చోరీలకు పాల్పడుతున్నారు. ఈనెల 11న రాత్రి వెల్గటూర్‌ మండలకేంద్రంలోని బీరెల్లి శ్రీనివాస్‌ ఇంట్లో దొంగలు పడి 14 తులాల బంగారం, రూ.లక్ష నగదు, విలువైన వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈనెల 17న రాత్రి ఇబ్రహీంపట్నం మండలకేంద్రానికి చెందిన కుంబోజి లక్ష్మీ అనే వృద్ధురాలి మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. 15 రోజుల్లో జగిత్యాల రూరల్‌ మండలంలోని తిమ్మాపూర్‌ అంగన్‌వాడీలో రేషన్‌బియ్యం, పొరండ్ల అంగన్‌వాడీ కేంద్రంలో నూనె ప్యాకెట్లు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈనెల 21న రాత్రి మెట్‌పల్లి పట్టణంలోని బస్‌డి పో వద్ద మహాలక్ష్మీ వైన్స్‌లో చోరీకి పాల్పడిన దొ ంగ కౌంటర్‌లోనిని రూ.80వేల నగదు, సీసీపుటే జీ టీవీ, కంప్యూటర్‌ పరికరాలు ఎత్తుకెళ్లాడు.

భయంభయం...
జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు చిన్నపాటి పనిపై తాళంవే సి ఆరుబయటకు వెళ్లాలన్నా పట్టణాల్లో జంకుతున్నారు. నిత్యం తాళంవేసిన ఇళ్లల్లోనే చోరీలు జరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జగిత్యాల జిల్లాలోప్రజలు ఎటైనా వె ళ్తున్నప్పుడు ఇంటికి తాళంవేసి పోలీసులకో, స్థా నికులకు సమాచారం ఇస్తున్నా ఏదో ఒక సమయ ంలో దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడు తుండడంతో ఇంటికి తాళంవేసి బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు.

సీసీకెమెరాలున్నా... ఆగని దొంగతనాలు..
జిల్లా వ్యాప్తంగా నేరాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో నేనుసైతం కార్యక్రమం ద్వారా పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సీసీకెమెరాలను ఏర్పాటుచేసినా చోరీలు త గ్గడం లేదు. దీంతో పాటు పోలీసుశాఖ నిరంతర నిఘా ఏర్పాటుకు బ్లూకోట్స్‌ టీంలను సైతం ఏ ర్పాటుచేసి నిఘా పెంచినా చోరీలు ఆగడం లేదు.

రాత్రివేళల్లోనే చోరీలు..
జగిత్యాల జిల్లావ్యాప్తంగా దొంగతనాలు రాత్రివేళల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం దొంగలు తాళం వేసిన ఇళ్లను చూసి రాత్రివేళలో చోరీలకు పాల్పడుతున్నారు. చాలామంది ఇంటి కి తాళంవేసి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచా రం అందించాలని చెప్పినా విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టుకోవద్దని చెప్పినా అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో దొంగలు తాళంవేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు.

పాతనేరస్తులపై నిఘా :
జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలకు పా త నేరస్తులే కారణమని పోలీసులు జైళ్ల నుంచి బ యటకు వెళ్లిన దొంగలపై నిఘా పటిష్టం చేయడ ంతో పాటు వారి కదలికలపై ఎప్పటికప్పుడు స మాచారం సేకరిస్తున్నారు. పాత దొంగతనాలకు పాల్పడి బయటకు వచ్చిన వారు ప్రస్తుతం ఎక్క డ నివసిస్తున్నారు. ఏం పనిలో ఉన్నారని విచారిస్తున్నారు. దీంతో మెట్‌పల్లి పోలీసులు ఇప్పటికే ఓ పాత దొంగను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పెగడపల్లి పోలీసులు కూడా కొంతమంది దొంగలను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

మహాలక్ష్మీ వైన్స్‌లో చోరీ
మెట్‌పల్లి:
పట్టణంలోని జాతీయ రహదారి పక్కన మహాలక్ష్మీ వైన్స్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. ముఖానికి మాస్క్‌ వేసుకున్న ఓ వ్యక్తి వైన్స్‌ పైకప్పు రేకులను తొలగించి లోపలికి చొరబడ్డాడు. అనంతరం కౌంటర్‌లోని రూ.80వేల నగదును దొంగిలించాడు. చోరీ తర్వా త బయటికి వెళ్లే క్రమంలో పైకి ఎక్కుతుండగా మద్యం బాటిళ్లు దెబ్బతిన్నాయి. అంతకు ముందు అక్కడున్న కొన్ని సీసీ కెమెరాలు ధ్వంసం చేయగా మిగిలిన సీసీ కెమెరాల్లో చోరీకి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. మొత్తం మీద రూ.1.50లక్షల నష్టం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

సమాచారం అందించాలి
ప్రజలు ఇంటికి తాళంవేసి వెళ్లేటప్పుడు పోలీసులతో పాటు స్థానికంగా ఉండేవారికి సమాచారం అందించి వెళ్లాలి. దీంతో తాళాలు వేసిన ఇంటి ప్రాంతాల్లో నిఘా పెంచుతాం. ప్రజలు ఇళ్లల్లో విలువైన వస్తువులు దాచి ఉంచొద్దు. తాళాలు వేసి బయటకు వెళ్లవద్దు.
– రత్నపురం ప్రకాశ్‌, డీఎస్పీ, జగిత్యాల

మరిన్ని వార్తలు