తల్లిదండ్రుల మరణంతో.. యువకుడి తీవ్రనిర్ణయం..!

8 Sep, 2023 09:02 IST|Sakshi

కరీంనగర్‌: గోదావరిఖనిలోని పరుశరాంనగర్‌కు చెందిన టంగుటూరి గోపాలకృష్ణ (29) గురువారం ఉరేసుకుని మృతిచెందినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం గోపాలకృష్ణ తల్లి, తండ్రి మృతిచెందారు.

అప్పటినుంచి మానసికంగా కుంగిపోయి తాగుడుకు బానిసయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి నాయినమ్మ టంగుటూరి రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సౌజన్య తెలిపారు.
 

మరిన్ని వార్తలు