పోరుగడ్డ..!

16 Sep, 2023 23:28 IST|Sakshi
తిరగబడ్డ

నేలకొరిగిన వందలాది మంది యోధులు

పోరు చరిత్రలో ఉమ్మడి జిల్లాది ప్రముఖపాత్ర

సాయుధ పోరాటానికి తలవంచిన నిరంకుశత్వం

నేడు తెలంగాణ విమోచన (విముక్తి) దినోత్సవం

రణభేరి మోగించిన ‘అనభేరి’

అనభేరి ప్రభాకర్‌రావు.. 1910 ఆగస్టు 15న తిమ్మాపూర్‌ మండలం పొలంపెల్లి గ్రామంలో జమీందారి కుటుంబంలో జన్మించారు. సాయుధ పోరాటంలో తొలి దళ నాయకుడిగా తుపాకీ పట్టి పేదలకు బాసటగా నిలిచారు. రజకార్ల ఆకృత్యాలు, ఆరాచకాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలనే లక్ష్యంతో జాగీర్‌దార్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. రజకార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా దళాన్ని ఏర్పాటు చేసి నిజాం గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. చివరకు 1948 మార్చి 14న హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ గుట్టల్లో నిజాం ప్రభుత్వం జరిపించిన కాల్పుల్లో అమరుడయ్యారు.

కరీంనగర్‌: ‘బాంచెన్‌.. కాల్మొక్తాదొరా.. అన్నవారే భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఉమ్మడి జిల్లా తిరగబడింది. రజాకార్లను తరిమికొట్టింది. ఇక్కడి ప్రజలు ఎక్కడికక్కడ పలుగు, పార, చేతికి ఏది దొరికితే దాంతోనే పోరుబాట పట్టారు. సాయుధ గెరిల్లాలుగా, నాయకులుగా అగ్రభాగాన నిలిచారు.

మరిన్ని వార్తలు