డీలిమిటేషన్‌తో ముడి పెట్టడం సరికాదు

23 Sep, 2023 01:56 IST|Sakshi
డాక్టర్‌ నగేశ్‌

తిమ్మాపూర్‌: డీలిమిటేషన్‌తో మహిళాబిల్లును ముడిపెట్టడం సరికాదని వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి డాక్టర్‌ నగేశ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరారు. పదేళ్ల తర్వాత అమలు చేస్తే ప్రస్తుతం బిల్లు పెట్టి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికిచిత్తశుద్ధి ఉంటే తక్షణమే మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేయాలని సూచించారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం బిల్లు పెట్టినట్లు ఉందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు మహిళలకు 33శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మహిళల ఓట్లు దండకపోవడం కోసమే ప్రభుత్వం ఇలా చేస్తుందని విమర్శించారు.

వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి డాక్టర్‌ నగేశ్‌

మరిన్ని వార్తలు