బతుకమ్మ మీరే చేస్తారా..!? మాకు మనసుంది.. పండుగ మేము చేస్తామంటూ..

23 Oct, 2023 10:03 IST|Sakshi
బతుకమ్మతో సుల్తానా బేగం

సాక్షి, కరీంనగర్: తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసి వేడుకల్లో పాల్గొన్న ముస్లిం యువతి సుల్తానా బేగం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మండలంలోని బూర్గుపల్లికి చెందిన సుల్తానాబేగం ఆదివారం బతుకమ్మను పేర్చి గ్రామస్తులతో కలిసి సంబురంగా వేడుకల్లో పాల్గొంది. సుల్తానా బేగంను ఎమ్మెల్యే రవిశంకర్‌, సర్పంచ్‌ రమ్య, ఎంపీటీసీ లక్ష్మి అభినందించారు.

మరిన్ని వార్తలు