నగదు పట్టివేత

14 Nov, 2023 01:02 IST|Sakshi

మల్లాపూర్‌(కోరుట్ల): సిరిపూర్‌ శివారులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద సోమవారం చేపట్టిన పోలీసుల వాహనాల తనిఖీల్లో బైక్‌పై తరలిస్తున్న రూ.1.14 లక్షల నగదు పట్టుకున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా తనిఖీలు చేస్తుండగా.. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ.1.14 లక్షలను స్వాధీనం చేసుకొని గ్రీవెన్స్‌సెల్‌కి అప్పగించినట్లు వివరించారు. పోలీస్‌ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

పీడీఎస్‌ బియ్యం..

మెట్‌పల్లిరూరల్‌(కోరుట్ల): అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు మెట్‌పల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఆదివారం కోరుట్ల వైపు నుంచి లారీలో తరలిస్తున్న 260 క్వింటాళ్ల బియ్యం మారుతినగర్‌ వద్ద పట్టుబడిందన్నారు. వీటి విలువ సుమారు రూ.5.20 లక్షలుంటుందని అన్నారు. లారీ యజమాని కోరుట్లకు చెందిన అహ్మద్‌గా గుర్తించి అతడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

రంగంపల్లిలో మద్యం..

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణ శివారు రంగంపల్లిలో బైక్‌పై వెళ్తున్న వేముల పెంటయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా.. హర్యాన రాష్ట్రానికి చెందిన మద్యం సీసాలు లభ్యమయ్యాయని ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. రంగంపల్లికి చెందిన పెంటయ్య ఢిల్లీ నుంచి కార్లు కొనుగోలు చేసి తెచ్చి ఈ ప్రాంతంలో అమ్ముతుంటాడని, తిరుగు పయనంలో హర్యాన మద్యం సీసాలను వెంట తెచ్చి బెల్టు షాపులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని పెంటయ్యపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సిబ్బంది శరత్‌బాబు, శ్రీనాద్‌, కృష్ణ, మోజెస్‌, కార్తీక్‌రెడ్డి ఉన్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్నట్టు గుర్తిస్తే సెల్‌ నెంబరు 87126 58817కు సమాచారమందించాలన్నారు.

పేకాట స్థావరంపై దాడి

మెట్‌పల్లి(కోరుట్ల): రెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. వారి నుంచి రూ.6.50లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు